https://oktelugu.com/

కరోనాను మించి.. ముందుంది ముసళ్ల పండుగ

ప్రపంచంలో వైరస్‌లు కొత్తేమీ కాదు. గతంలో స్పానిష్‌ ఫ్లూ.. ఎబోలా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌  అంటూ ఎన్నో వైరస్‌లు వచ్చాయి. అందరినీ ముప్పు తిప్పలు పెట్టాయి. కానీ.. ఇప్పుడొచ్చిన కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. లక్షల మందిని వేధిస్తూనే ఉంది. ఇప్పటివరకు వరల్డ్‌ వైడ్‌ 9 లక్షల మందిని బలితీసుకుంది. దాదాపు 3 కోట్ల మంది వరకు వైరస్‌ బారిన పడ్డారు. అయితే.. ఇలాంటి వైరస్‌లు ఈ కరోనాతో ఆగిపోవని, భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2020 12:05 pm
    Carona india

    Carona india

    Follow us on

    Carona india


    ప్రపంచంలో వైరస్‌లు కొత్తేమీ కాదు. గతంలో స్పానిష్‌ ఫ్లూ.. ఎబోలా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌  అంటూ ఎన్నో వైరస్‌లు వచ్చాయి. అందరినీ ముప్పు తిప్పలు పెట్టాయి. కానీ.. ఇప్పుడొచ్చిన కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. లక్షల మందిని వేధిస్తూనే ఉంది. ఇప్పటివరకు వరల్డ్‌ వైడ్‌ 9 లక్షల మందిని బలితీసుకుంది. దాదాపు 3 కోట్ల మంది వరకు వైరస్‌ బారిన పడ్డారు. అయితే.. ఇలాంటి వైరస్‌లు ఈ కరోనాతో ఆగిపోవని, భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌.

    Also Read: డేంజర్: కరోనాతోపాటే మరో రెండు భీకర వ్యాధులు

    రానున్న రోజుల్లో వైరస్‌లను ఎదుర్కొనేందుకు అందరూ మానసికంగా, శారీరకంగా ఇప్పటికంటే ఎక్కువగా సిద్ధపడాలని స్పష్టం చేశారు. రానురాను ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యంపై భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ రెడీ అయినట్లు రష్యా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలకు ఇండియాతో ఒప్పందం చేసుకుంది. మూడో దశ ట్రయల్స్‌ ఇంకా ప్రాసెస్‌లో ఉండగానే.. ఆ దేశం ఆల్‌రెడీ వ్యాక్సిన్‌ను ఆ దేశంలోకి విడుదల చేసింది.

    నవంబర్‌‌ 1న టీకా వస్తుందంటూ అగ్రదేశమైన అమెరికా ప్రకటించింది. పంపిణీకి రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలంటూ ఆయా రాష్ట్రాలకు సూచించింది. మన దేశంలోనూ ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌వో టీకాకు సంబంధించిన మరో వాదన వినిపించింది. వ్యాక్సిన్‌ వచ్చినా అది తొందరగా పేద దేశాలకు అందించాలని.. లేదంటే భారీ నష్టం చూడాల్సి వస్తుందని డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్‌ అభిప్రాయపడ్డారు. అందుకే ప్రతీ దేశానికి వ్యాక్సిన్‌ అందించడం తప్పనిసరి అని సూచించారు.

    Also Read: షాకింగ్: వికటించిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్.. ప్రయోగాలకు బ్రేక్

    టీకా కొనలేని.. తయారు చేసుకోలేని వంద దేశాలకు టీకా అందేలా చూసేందుకే డబ్ల్యూహెచ్‌వో కొవ్యాక్స్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భారత్‌నూ భాగస్వామిగా చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇందులో చేరేదేలేదని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో వ్యాక్సిన్‌ వచ్చాక పేద దేశాలకు ఎవరి నుంచి సాయం అందుతుందో తెలియకుండా ఉంది.