https://oktelugu.com/

స్టార్ డైరెక్టర్ తో ఎట్టకేలకు ‘అక్కినేని’  హీరో సినిమా? 

చిత్రసీమలోకి అడుగుపెట్టిన వారందరికీ ఒక్కోక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంటుంది.  నటీనటులు ఫలానా దర్శకులతో పని చేయాలని.. ఫలానా బ్యానర్లో పని చేయాలని తహతహలాడుతుంటారు. ఇక దర్శకులు ఏమో స్టార్ హీరోలు హీరోయిన్లతో పని చేయాలని కోరుకుంటారు. ఇక సినిమాలను నిర్మించే నిర్మాతలు కూడా ఫలానా వారితో పని చేయాలని కోరుకుంటారు. క్రేజీ కాంబినేషన్లను సెట్ చేసిందుకు ఉవ్విళ్లురుతుంటారు. Also Read: బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే ! డబ్బులు ఖర్చుపెట్టే నిర్మాత అనుకుంటే కానిదీ ఏముందని […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2020 / 11:58 AM IST

    Akkineni Akhil

    Follow us on


    చిత్రసీమలోకి అడుగుపెట్టిన వారందరికీ ఒక్కోక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంటుంది.  నటీనటులు ఫలానా దర్శకులతో పని చేయాలని.. ఫలానా బ్యానర్లో పని చేయాలని తహతహలాడుతుంటారు. ఇక దర్శకులు ఏమో స్టార్ హీరోలు హీరోయిన్లతో పని చేయాలని కోరుకుంటారు. ఇక సినిమాలను నిర్మించే నిర్మాతలు కూడా ఫలానా వారితో పని చేయాలని కోరుకుంటారు. క్రేజీ కాంబినేషన్లను సెట్ చేసిందుకు ఉవ్విళ్లురుతుంటారు.

    Also Read: బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే !

    డబ్బులు ఖర్చుపెట్టే నిర్మాత అనుకుంటే కానిదీ ఏముందని అందరు అనుకుంటారు. అయితే అనుకోగానే అన్ని కుదరవు.. హీరోహీరోయిన్లు అందుబాటులో ఉంటే డైరెక్టర్ సెట్ కాకపోవచ్చు. ఇలా వీరుంటే వారు.. వారంటే వీరు లేక మధ్యలోనే ఆగిపోయిన సినిమాలెన్నో ఉన్నాయి. చాలామంది నిర్మాతలు వారి డ్రీమ్స్ నెరవేర్చుకోకుండానే సినిమా నిర్మాణాలు చేస్తూ ముందుకెళుతుండటం చూస్తునే ఉన్నాం. ఇలాంటి కోవలోకే నిర్మాత అనిల్ సుంకర వస్తారు..

    నిర్మాత అనిల్ సుంకర కూడా ఒక్క డ్రీమ్ ఉంది. ఆయన ఇండస్ట్రీలోని అందరితో సన్నిహితంగా ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చాలా సన్నహితంగా మెలుగుతుంటారు. అయితే ఆయనకు తొలి నుంచి అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం. ఈ కారణంగానే ఆయన అక్కినేని హీరోలలో ఎవరితోనైనా సినిమా చేయాలని భావించారు. ఎన్నోసార్లు ప్రయత్నించినా సెట్ కాకపోవడంతో అనిల్ సుంకర డ్రీమ్ నెరవెరకుండా పోయింది.

    తాజాగా ‘సైరా’ దర్శకుడు సురేందర్-అఖిల్ కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమా తొలుత బన్నీ వాసు దగ్గరకు వెళ్లగా ఆయన అనిల్ సుంకరకు రికమెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన దీనిని 14రీల్స్ సంస్థకు ఇద్దామనుకున్న కుదరల్లేదు. దీంతో ఈ సినిమాను అనిల్ సుంకర వద్దే ఆగింది. సురేందర్ రెడ్డి సినిమాలంటే భారీ బడ్జెట్ ఉండాల్సిందే.

    Also Read: కల తీరకుండానే జయప్రకాశ్‌ రెడ్డి కనుమూశారు

    కథ డిమాండ్ మేరకు 30 నుంచి 40కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలుస్తోంది. అఖిల్ పై అంత బడ్జెట్ ఎక్కువై అయినప్పటికీ అనిల్ సుంకర్ తన డ్రీమ్ తీర్చుకునేందుకు ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తయ్యాక అనిల్ సుంకర నిర్మించే మూవీ పట్టాలెక్కబోతుందని సమాచారం.