Pushpa Movie Pre release Event: టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “పుష్ప”. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 17 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక సహా చిత్ర యూనిట్ హాజరు కాగా దర్శకులు రాజమౌళి, కొరటాల శివలు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.

అయితే ఈ వేడుకలో అల్లువారి వారసులు అల్లు అయాన్, అర్హలు స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. తండ్రి అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్హ, అల్లు అయాన్ లు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై చేసిన హడావిడి అందరినీ ఆకట్టుకుంది. ఇక వీరిద్దరూ చెప్పిన డైలాగ్స్ వెరీవెరీ స్పెషల్ గా నిలిచాయి. ముందుగా అల్లు అయాన్ నేను మాట్లాడతా అంటూ… మైక్ తీసుకున్నాడు. తగ్గేదే లే అంటూ తండ్రి మేనరిజాన్ని చూపించి అందరి తోనూ క్లాప్స్ కొట్టించాడు. ఆ తర్వాత మైక్ అందుకున్న అల్లు అర్హ అందరికీ నమస్కారం, హాయ్ అంటూ పలకరించింది. తండ్రి అల్లు అర్జున్ స్టైల్ లో తగ్గేదే లే… అంటూ డైలాగ్ చెప్పి విజిల్స్ వేయించింది ఈ చిన్నారి. ఈ చిన్నారులు చెప్పిన మాటలతో అయాన్, అర్హలు అక్కడ ఉన్న అతిథులతో పాటు ఆహుతులను కూడా ఆకట్టుకుంది. వీరి మాటలకు అల్లు అర్జున్, అల్లు అరవింద్ మురిసిపోతూ నవ్వుకున్నారు.
