Jayam Ravi Shocking Statement: ప్రముఖ తమిళ నటుడు జయం రవి గత కొంత కాలం గా తన భార్య ఆర్తి తో విడాకుల వ్యవహారం లో నలిగిపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రముఖ సింగర్ కేనీషా ఫ్రాన్సిస్ తో కొన్నేళ్ల నుండి సహజీవనం చేస్తున్న ఆయన, ఆర్తి తో విడాకులు కోరుకుంటున్నాడు. కానీ ఆమె విడాకులు ఇవ్వకుండా, కొన్ని కండీషన్స్ పెడుతూ , జయం రవి ని పబ్లిక్ గా డీ ఫేమ్ చేసేలా ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. దీనిపై జయం రవి నేడు చాలా తీవ్ర స్థాయిలో రెస్పాన్స్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన చాలా సున్నితంగానే ఈ విషయాన్ని డీల్ చెయ్యాలని అనుకున్నాడు , కానీ హద్దులు దాటడం తో సహనం నశించి మీడియా ముందుకొచ్చి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘నేను మీ అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నాను. ఇప్పటి నుండి నాకు విడాకులు వచ్చేంత వరకు , నేను సినిమాల్లో నటించబోవడం లేదు. నేను ప్రస్తుతం చేసిన సినిమాని కూడా విడుదల చెయ్యనివ్వను. ఇక పై నేను అవమానాలు తీసుకోలేను , హద్దులు దాటేసారు. ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారో, రండి , నేను ఇక్కడే ఉన్నాను , ఎంత ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో పెట్టండి. ఇక నుండి నేను సైలెంట్ గా ఉండాలని అనుకోవడం లేదు. ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ , అన్నీ తెగించే ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు నేను వదిలిపెట్టను’ అంటూ జయం రవి చెప్పుకొచ్చాడు . ఇండస్ట్రీ లో ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి జయం రవి , అంతే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి స్థాయి ఉన్న ఈ హీరో , ఇలా మీడియా ముందుకొచ్చి , వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం అంటే , అతను ఎంతటి మనోవేదనకు గురయ్యాడో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
SHOCKINGLY STATMENT of Jayam Ravi in Press Meet !!
“ First of all, what I need to say is… my movies will not be released on screens from now on, until I get my divorce. I am not going to act anymore because I am not able to act.
I cannot bear the insults !!! the unnecessary… pic.twitter.com/eXL0hgy63B
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) May 16, 2026
