Jawan Collection: ఏంటీ కలెక్షన్లు.. వరల్డ్ వైడ్ 50 రోజుల్లో జవాన్ మూవీ ఎంత సంపాదించిందో తెలుసా?

పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. నిజానికి జవాన్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టాక్ తో సంబంధం లేకుండా జవాన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. బాహుబలి 2 రికార్డు సైతం బ్రేక్ చేసింది.

Written By: NARESH, Updated On : October 27, 2023 12:40 pm

Jawan Collections

Follow us on

Jawan Collection: షారుఖ్ ఖాన్ ఒక పదేళ్లు స్ట్రగుల్ అయ్యారు. ఒకప్పటి బాలీవుడ్ బాద్షా ఒక్క హిట్ కోసం తపించిపోయాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కవుట్ కాలేదు. దీంతో కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నాడు. పడిలేచిన కెరటంలా పఠాన్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యారు. వెయ్యి కోట్లు అవలీలగా కొల్లగొట్టాడు. పఠాన్ జోరు థియేటర్స్ లో తగ్గక ముందే జవాన్ అంటూ వచ్చేశాడు షారుఖ్. సౌత్ ఇండియా యంగ్ సెన్సేషన్ అట్లీ జవాన్ చిత్రానికి దర్శకుడు.

పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. నిజానికి జవాన్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టాక్ తో సంబంధం లేకుండా జవాన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. బాహుబలి 2 రికార్డు సైతం బ్రేక్ చేసింది. జవాన్ మూవీలో షారుఖ్ డ్యూయల్ రోల్ చేయడం విశేషం. తండ్రి కొడుకులుగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా అనిరుధ్ తన మార్క్ క్రియేట్ చేశాడు.

జవాన్ చిత్రంలో షారుఖ్ కి జంటగా నయనతార నటించడం మరొక విశేషం. కీలక రోల్స్ సౌత్ స్టార్స్ నటించారు. విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశారు. మరో ప్రాధాన్యత ఉన్న పాత్రలో ప్రియమణి నటించింది. దీపిక పదుకొనె గెస్ట్ రోల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాగా జవాన్ బాక్సాఫీస్ వద్ద 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం గురువారంతో అర్థశతదినోత్సవం జరుపుకుంది. ఈ రోజుల్లో 50 డేస్, 100 డేస్ ఫంక్షన్స్ చాలా రేర్. జవాన్ మూవీ ఆ ఫీట్ అందుకుంది. 50వ రోజు కూడా జవాన్ రూ. 11 లక్షల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక 50 రోజులకు జవాన్ రూ. 1145 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదే ఏడాది షారుక్ మరో చిత్రం డంకీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. డంకీ డిసెంబర్ 21న విడుదల కానుంది.