Jayaprakash Narayana : హైదరాబాద్ నగర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి అంత బాగా వుందా జేపీ గారు

కేసీఆర్ సర్కార్ పై జేపీ చేసిన ప్రశంసలు చూసి అంతా అవాక్కయ్యారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి అంత బాగావుందా జేపీ గారు అంటూ ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 27, 2023 1:37 pm

Jayaprakash Narayana : జయప్రకాష్ నారాయణ్.. అద్భుతమైనటువంటి మేధావి. ఎన్నో విషయాలపై సమగ్ర విశ్లేషణ చేసిన వ్యక్తి. అందరూ ఎంతో గౌరవించే వ్యక్తి, కలెక్టర్ గా , ఐఏఎస్ గా సమాజానికి సేవ చేయాలని రాజీనామా చేసి పార్టీ పెట్టి సామాజిక సేవ చేశాడు. వ్యక్తిగా నిజాయితీ పరుడు, ఆలోచనపరుడు.. సమాజానికి ఏదో చేయాలన్న తపన కలిగిన వ్యక్తి.

రెండు రోజుల క్రితం.. కేటీఆర్ తో జరిగిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేనా జేపీ?.. కేటీఆర్ సైలెంట్ గా ఉంటే.. జేపీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. కేటీఆర్ ఇదంతా కూడా ఎన్నికల సందర్భంగా పీఆర్ ప్రచారం కోసమే ఇలా ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. కోస్తా, ఆంధ్రా మూలాలున్నట్టువంటి వారు హైదరాబాద్ నగరంలో ఉన్నారు కాబట్టి.. వారి ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు కేటీఆర్ పన్నిన పన్నాగంగా ఇది తెలుస్తోంది. ఇది జయప్రకాష్ నారాయణ్ కు ఇది తెలియదా అని చూసిన వారంతా అనుకున్నారు. కేటీఆర్ వలలో జేపీ ఇలా చిక్కుకుపోయాడేంటి అని ఆశ్చర్యపోక మానదు.

కేసీఆర్ సర్కార్ పై జేపీ చేసిన ప్రశంసలు చూసి అంతా అవాక్కయ్యారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి అంత బాగావుందా జేపీ గారు అంటూ ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.