Sony TV: క్రికెట్ చూద్దామని ఫ్లిప్ కార్ట్ లో సోనీ టీవీ కొన్నాడు.. ఓపెన్ చేసి చూసి షాకైన కస్టమర్

దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్డు బిగ్ బిలియన్ డేస్ పేరిట ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో సోనీ కంపెనీకి చెందిన టీవీని కొనుగోలు చేయాలని భావించాడు ఆర్యన్.

Written By: Srinivas, Updated On : October 27, 2023 4:39 pm

Sony TV

Follow us on

Sony TV: వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టముండని వారుండరు. ఇక క్రికెట్ గురించి తెలిసిన వారైతే ఈ టోర్నీ ముగిసే వరకు ఇతర పనుల జోలికి వెళ్లకుండా ఉంటారు. అయితే వరల్డ్ కప్ మ్యాచ్ లను చిన్న చిన్న టీవీల్లో చూస్తే ఏం మజా ఉంటుంది. బిగ్ స్క్రీన్ పై వీక్షిస్తే ఆ థ్రిల్లించే వేరు. దీంతో చాలా మంది వరల్డ్ కప్ ముగిసే వరు బిగ్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేసుకుంటారు. కొందరు పెద్ద పెద్ద టీవీలు లేని వారు కొత్తవాటిని కొనుగోలు చేస్తారు. అలాగే 2023 వరల్డ్ కప్ ను బిగ్ స్క్రీన్ పై చూస్తూ ఎంజాయ్ చేయాలని ఓ యువకుడు భావించాడు. దీంతో ఫ్లిప్ కార్డ్ ద్వారా బ్రాండెడ్ కంపెనీ అయిన సోనీ టీవీని బుక్ చేసుకున్నారు. ఇంటికొచ్చిన టీవిని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. ఆ తరువాత తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఇంతకీ ఆ యువకుడికి ఎదరైనా చేదు అనుభవం ఏంటి? అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే..

చాలా మంది ప్రత్యేక సందర్భాల్లో కొత్త టీవీని కొనుగోలు చేయాలని చూస్తుంటారు. దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్డు బిగ్ బిలియన్ డేస్ పేరిట ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో సోనీ కంపెనీకి చెందిన టీవీని కొనుగోలు చేయాలని భావించాడు ఆర్యన్. దీంతో రూ. లక్ష పెట్టి ఆన్ లైన్ లో బుక్ చేశాడు. అక్టోబర్ 7న బుక్ చేసుకోగా 10 టీవీ డెలివరీ అయింది. అయితే ఎలాగూ టీవీనే కదా అని వెంటనే ఓపెన్ చేయలేదు. టీవీ మెకానిక్ ను రప్పించి ఫిటింగ్ చేసే సమయంలో అట్టపెట్టను ఓపెన్ చేయగా దానిని చూసి షాక్ అయ్యాడు.

అందులో సోనీ కంపెనీకి చెందిన టీవీ లేదు. థామ్సన్ టీవీ ఉంది. అయితే తనకు జరిగిన నష్టం గురించి వెంటనే ఫిర్యాదు చేసినట్లుఆర్యన్ ట్విట్టర్ ద్వారా షేర్ చెప్పాడు. ముందుగా ఫ్లిప్ కార్డు కరస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే టీవీ ఫొటోలను అప్లోడ్ చేయమని చెపో్పారు. అయినా స్పందిచలేదు. అలా రెండు, మూడు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అయితే మొదటి రిజల్యూషన్ తేదీని అక్టోబర్ 24న ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా 20వ తేదీనే సమస్య పరిష్కరించినట్లు చూపించారు.. ఆ తరువాత నవంబర్ 1వ తేదీకి మార్చారు.

దీంతో తనకు జరిగిన నష్టాన్ని ఆర్యన్ ఎక్స్ అనే ఖాతా ద్వారా గోడు వెల్లబోసుకున్నాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో ఫ్లిప్ కార్డు దిగొచ్చింది. ఆర్యన్ కు జరిగిన అసౌకర్యంపై క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పోస్టుపై ఓ నెటిజన్ స్పందించారు. ఇక నుంచి నేను ఖరీదైన వస్తువులను ఫ్లిప్ కార్డు ద్వారా కొనుగోలు చేయనని తెలిపాడు. అంతేకాకుండా చాలా మంది ఆర్యన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త టీవీలో క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ చూద్దామనుకున్న ఆర్యన్ ఆశలు అడియాశలయ్యాయి.