https://oktelugu.com/

Jawan Collections: జవాన్ 14వ రోజు కలెక్షన్స్… మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో, ఎన్ని వందల కోట్ల లాభం అంటే!

ఇక 14వ రోజు జవాన్ వసూళ్లు పరిశీలిస్తే... రూ. 9 కోట్ల నెట్, రూ. 15 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో కూడా జవాన్ చిత్రానికి భారీ ఆదరణ దక్కడం విశేషం.

Written By:
  • Shiva
  • , Updated On : September 21, 2023 / 09:34 AM IST

    Jawan Collections

    Follow us on

    Jawan Collections: మిక్స్డ్ టాక్ లో కూడా జవాన్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దర్శకుడు అట్లీ రెగ్యులర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా జవాన్ తెరకెక్కించాడు. మూవీ మీద ఉన్న హైప్ రీత్యా భారీ ఓపెనింగ్స్ దక్కాయి. ఆ జోరు కొనసాగిస్తూ జవాన్ వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది. జవాన్ ఫస్ట్ వీక్ రూ. రూ. 368.38 కోట్లు నెట్ వసూలు చేసింది. 8వ రోజు రూ. 21.6 కోట్లు, 9వ రోజు రూ. 19.10 కోట్లు, 10వ రోజు రూ. 31.80, 10వ రోజు రూ. 31.80 కోట్లు, 11వ రోజు రూ. 36.85 కోట్లు, 12వ రోజు రూ. 16.25 కోట్లు, 13వ రోజు రూ. 14.40 కోట్ల వసూళ్లు అందుకుంది. జవాన్ వసూళ్లు నిలకడగా సాగాయి.

    ఇక 14వ రోజు జవాన్ వసూళ్లు పరిశీలిస్తే… రూ. 9 కోట్ల నెట్, రూ. 15 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో కూడా జవాన్ చిత్రానికి భారీ ఆదరణ దక్కడం విశేషం. రెండు వారాలకు జవాన్ $39.4 మిలియన్ వసూళ్లు అందుకుంది. ఇది రూపాయల్లో 325 కోట్లు అని చెప్పవచ్చు. నార్త్ అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ రికార్డుకి చేరువలో ఉంది. $10 మిలియన్ వరకు రాబట్టింది. ఆర్ ఆర్ ఆర్ $ 14.3 మిలియన్ వసూళ్లు అందుకుంది.

    14 రోజులకు జవాన్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 518 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రూ. 922 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. జవాన్ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఆ లెక్కన రెండు వారాలకు జవాన్ రూ. 218 కోట్ల లాభాలు పంచింది. పఠాన్, జవాన్ చిత్రాలతో షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. 2022 బాలీవుడ్ క్లిష్ట పరిస్థితులు చూసింది. ఈ ఏడాది పఠాన్, జవాన్, గదర్ 2 వంటి భారీ హిట్స్ పరిశ్రమ వర్గాల్లో జోష్ నింపాయి.

    జవాన్ చిత్రానికి అట్లీ దర్శకుడన్న విషయం తెలిసిందే. షారుఖ్ ఖాన్ కి జంటగా నయనతార నటించింది.దీపికా పదుకొనె గెస్ట్ రోల్ లో అలరించారు. విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశారు. ప్రియమణి ఓ కీలక పాత్రలో మెరిశారు. జవాన్ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. జవాన్ సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదలైంది.