https://oktelugu.com/

Manchu Vishnu Kannappa: మంచు విష్ణు కన్నప్ప నుండి తప్పుకున్న హీరోయిన్… కారణం ఏంటంటే!

అయిప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇటీవల కన్నప్ప పేరుతో భారీ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. శ్రీకాళహస్తిలో ఈ చిత్ర పూజా కార్యక్రమం జరిగింది.

Written By: , Updated On : September 21, 2023 / 09:06 AM IST
Manchu Vishnu Kannappa

Manchu Vishnu Kannappa

Follow us on

Manchu Vishnu Kannappa: టైం బాగోకపోతే అరటి పన్ను తిన్నా పన్ను ఊడుతుందట. హీరో మంచు విష్ణు పరిస్థితి అలానే ఉంది. ఒక్క హిట్ అంటూ దశాబ్దాలుగా ప్రదక్షిణలు చేస్తున్నారు. వరుస పరాజయాలతో మార్కెట్ కోల్పోతూ వచ్చాడు. మంచు విష్ణు గత చిత్రం జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ మాత్రం నిల్. కనీసం కోటి రూపాయల షేర్ రాలేదు. ఆ మూవీలో నటించిన సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ అంత కూడా కలెక్షన్స్ లేవు. సినిమాలో అంతో ఇంతో విషయం ఉన్నా జనాలు చూడలేదు. మంచు హీరోలను ప్రేక్షకులు మర్చిపోయారు.

అయిప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇటీవల కన్నప్ప పేరుతో భారీ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. శ్రీకాళహస్తిలో ఈ చిత్ర పూజా కార్యక్రమం జరిగింది. మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు హీరోయిన్ గా నటిస్తున్న నుపుర్ సనన్ హాజరయ్యారు. చిత్ర యూనిట్ పాల్గొన్నారు. మహాభారతం సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతా బాగానే ఉందనుకుంటే హీరోయిన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.

నుపుర్ సనన్ కన్నప్ప చిత్రం చేయడం లేదు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా తెలియజేశారు. మంచు విష్ణు…. నుపుర్ సనన్ కన్నప్ప ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని చెప్పేందుకు బాధగా ఉంది. ఆమెకు షెడ్యూల్స్ విషయంలో సమస్య వచ్చింది. మరొక హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. నుపుర్ సనన్ ఇతర ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశారు. ఒకరకంగా మంచు విష్ణుకు ఇది షాక్ అని చెప్పొచ్చు.

మరి మంచు విష్ణు చెప్పినట్లు ఆమెకు డేట్స్ కుదర్లేదా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే నుపుర్ సనన్ చేతిలో పెద్దగా ప్రాజెక్ట్స్ లేవు. ఆమె ఇప్పుడే ఎదుగుతున్న హీరోయిన్. తెలుగులో టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వచ్చే నెలలో దసరా కానుకగా విడుదల కానుంది. హీరోయిన్ కృతి సనన్ చెల్లలే ఈ నుపుర్ సనన్. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడని సమాచారం. ఆయన శివుడిగా గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నాడట.