spot_img
Homeఎంటర్టైన్మెంట్Jawan Collections: ఐదో రోజు అదుర్స్ అనిపించేలా జవాన్ వసూళ్లు .. షారుఖ్ సునామీ!

Jawan Collections: ఐదో రోజు అదుర్స్ అనిపించేలా జవాన్ వసూళ్లు .. షారుఖ్ సునామీ!

Jawan Collections: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్నాడు. ఆయన తాజాగా నటించిన జవాన్ సినిమా విడుదలై ఐదు రోజులు అవుతున్నా వసూళ్లు ఎక్కడ కూడా డ్రాప్ కాకుండా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా నాలుగో రోజు కేవలం ఇండియా మార్కెట్ లో 81 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీ సినిమా హిస్టరీ లో ఒకే రోజు ఎక్కువ కలెక్షన్స్ చేసిన సినిమా గా జవాన్ నిలిచింది. ఇదే సినిమా మొదటి రోజు 76 కోట్లు సాధించి ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమా గా కూడా నిలిచింది.

ఇక ఏ సినిమా కు అయిన మొదటి మండే వసూళ్లు అనేవి చాలా ప్రధానం . సినిమా ఫుల్ రన్ సత్తా ఏమిటో, సినిమా మీద కామన్ ఆడియన్స్ అభిప్రాయం ఎలా ఉందో తెలిసేది మండే రోజు. ఆ రోజు వచ్చే వసూళ్లు ను బట్టి ఏ సినిమా మీద అయిన ఒక అంచనాకు రావచ్చు. ఆ కోణంలో చూసుకుంటే జవాన్ సినిమా మండే టెస్ట్ లో పాస్ అయ్యిందనే చెప్పాలి. ఐదో రోజు ఇండియా వైడ్ గా దాదాపు 30 కోట్ల నెట్ వసూళ్లు చేసింది జవాన్ సినిమా. దీనితో ఓవరాల్ గా మొదటి ఐదు రోజుల్లో 300 కోట్ల నెట్ క్రాస్ చేసింది ఈ సినిమా.

ఈ ఏడాది మూడు వందల కోట్ల మార్క్ దాటిన మూడో హిందీ సినిమా గా జవాన్ నిలిచింది. ఇక గ్రాస్ విషయానికి వస్తే మొదటి నాలుగు రోజుల్లో 500 కోట్ల పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఐదో రోజుకి దాదాపు 600 కోట్ల క్లబ్ కి చేరువగా వచ్చింది. ఈ శుక్రవారం నాటికి 800 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి, వీకెండ్ నాటికి 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.

మరోపక్క ఓవర్శిస్ లో కూడా కింగ్ ఖాన్ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే 20 మిలియన్స్ డాలర్లు కొల్లగొట్టిన జవాన్ సినిమా అదే దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్తుంది. ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే దాదాపు 200 కోట్ల మార్క్ కు దగ్గరగా వచ్చింది జవాన్ సినిమా. సౌత్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన సినిమా అటు నార్త్ ఇటు సౌత్ ప్రేక్షకులను అలరిస్తుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version