https://oktelugu.com/

Javed Akhtar: అనిమల్ వివాదం మీద స్పందించిన జావెద్ అక్తర్…మరి సందీప్ వంగ రియాక్షన్ ఏంటి..?

సందీప్ రెడ్డి వంగా అలాంటి విషయాలు మాకు చెప్పేముందు మీ కొడుకు కు చెప్పు ఆయన కూడా 'మీర్జాపూర్ 'అనే ఒక సిరీస్ లో ఇలాంటి సీన్ల ను వాడాడు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దానికి జావెద్ అక్తర్ స్పందిస్తూ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 17, 2024 / 06:08 PM IST

    Javed Akhtar

    Follow us on

    Javed Akhtar: బాలీవుడ్ లో మంచి కథ రచయితగా పేరుపొందిన జావెద్ అక్తర్ మరోసారి సందీప్ రెడ్డివంగా మీద ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు. అయితే వీళ్ళిద్దరికీ అనిమల్ సినిమా విషయంలో దాదాపు కొద్ది రోజుల నుంచి మాటల యుద్ధం అయితే నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే… మొదటగా ‘అనిమల్ ‘ సినిమాను ఉద్దేశించి ఈ సినిమాలో ఆడవాళ్లను తక్కువ చేసి చూపించారు అంటూ ఆయన కొన్ని కామెంట్లు చేశాడు.

    దానికి కౌంటర్ గా సందీప్ రెడ్డి వంగా అలాంటి విషయాలు మాకు చెప్పేముందు మీ కొడుకు కు చెప్పు ఆయన కూడా ‘మీర్జాపూర్ ‘అనే ఒక సిరీస్ లో ఇలాంటి సీన్ల ను వాడాడు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దానికి జావెద్ అక్తర్ స్పందిస్తూ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తను ఈ విషయం మీద మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ కి నా సినిమాల్లో ఒక తప్పు కూడా దొరకలేదు. అందుకే నా కొడుకును టార్గెట్ చేసి వాడి తప్పుని ఎత్తి చూపిస్తున్నాడు అంటూనే ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా అంటూ సందీప్ రెడ్డి వంగ మీద ఘాటు వ్యాఖ్యలైతే చేసినట్టుగా తెలుస్తుంది.

    ఇక దాంతో పాటుగా నా కొడుకు ప్రొడక్షన్ హౌస్ లో మీర్జాపూర్ అనే సినిమా తెరకెక్కింది. అందులో నా కొడుకు అయిన ఫరాన్ అక్తర్ నటించలేదు. దానికి దర్శకత్వం కూడా వహించలేదు. అలాంటప్పుడు అది ఆయన చేసినట్టుగా ఎలా అవుతుంది అంటూ కూడా సందీప్ రెడ్డి మీద ప్రశ్నలు కురిపించాడు. ఇక అలాగే అనిమల్ సినిమా మీద తను చేసిన కామెంట్లను గుర్తు చేసుకుంటూ నేను ఆ సినిమా చూడలేదు కొన్ని కొన్ని సీన్లు వేరే వాళ్ళు చెప్తే విన్నాను.

    ఒక అమ్మాయితో హీరో తన షూ నాకమని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అతన్ని క్వశ్చన్ చేశాను. అంతే తప్ప పర్సనల్ గా ఆయన మీద కోపం తో నేను అలాంటి కామెంట్లు అయితే చేయలేదు అంటూ తను తాను సమర్ధించుకుంటూనే, ఆయన పైన కొన్ని విమర్శలు అయితే చేశాడు. మరి దీనికి సందీప్ రెడ్డి వంగ ఎలాంటి రిప్లై ఇస్తాడో వేచి చూడాలి…