Jatt : ఒకప్పుడు బాలీవుడ్ లో మాస్ హీరో అంటే సన్నీ డియోల్(Sunny Deol) మాత్రమే. ఈయన చేసిన యాక్షన్ చిత్రాలు అప్పట్లో ఒక సెన్సేషన్. లెజెండ్ ధర్మేంద్ర కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మొదటి సినిమా నుండే దక్కించుకున్నాడు సన్నీ డియోల్. ఇతని తమ్ముడు బాబీ డియోల్(Bobby Deol) ఇప్పుడు ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ విలన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆయన ‘డాకు మహారాజ్’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ ని పలకరించాడు. ఇదంతా పక్కన పెడితే మాస్ ప్రాంతాల్లో సన్నీ డియోల్ కి ఇప్పటికీ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అని నిరూపించింది నిన్న విడుదలైన ‘జాట్'(Jaat Movie) చిత్రం. మన టాలీవుడ్ యంగ్ దర్శకుడు గోపిచంద్ మలినేని(Gopichand Malineni) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విడుదలకు ముందు ఈ చిత్రానికి ఏమి వసూళ్లు వస్తుందిలే అని చాలా మంది తక్కువ అంచనా వేశారు.
Also Read : పాకిస్తాన్ లో మొట్టమొదటి రూ.100 కోట్ల సినిమా.. ఏదో తెలుసా..?
కానీ విడుదల తర్వాత అందరినీ షాక్ కి గురి చేసింది ఈ చిత్రం. బుక్ మై షో యాప్ లో మొదటి రోజు ఈ చిత్రానికి లక్ష పది వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది కేవలం ఆన్లైన్ టికెట్ సేల్స్ మాత్రమే. నార్త్ ఇండియా లో మాస్ సింగిల్ స్క్రీన్స్ చాలానే ఉన్నాయి. వీటికి ఆన్లైన్ టికెట్ సేల్స్ ఉండవట. అవి కూడా కలుపుకొని చూస్తే, ఈ చిత్రానికి మొదటి రోజున 18 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఈ వీకెండ్ భారీ వసూళ్లను నమోదు చేసుకునే అవకాశం ఉంది. ‘గద్దర్ 2’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, సన్నీ డియోల్ మరోసారి ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించడంలో సఫలం అయ్యాడు.
నిన్న ఆన్లైన్ లో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వీడియోలు బయటకు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకులు యడ్ల బండ్లు, ట్రాక్టర్స్ లో వచ్చి ఈ సినిమాని చూస్తున్నారు. ఓటీటీ యుగం లో ఒక సినిమాకు ఇలాంటి వింతలు జరగడం చాలా కాలం తర్వాత చూసున్నాము. ఇప్పుడే ఇలా ఉందంటే, ఇక ఆరోజుల్లో సన్నీ డియోల్ మాస్ ఏ రేంజ్ లో ఉండేదో మీరే ఊహించుకోండి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కి కలిపి వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తుందని అంటున్నారు. రీసెంట్ గానే విడుదలైన సల్మాన్ ఖాన్ ‘సికందర్’ చిత్రం వాష్ అవుట్ అయిపోయింది. ఈ సినిమాకు ఇండియా వైడ్ గా 150 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కూడా ఇప్పటి వరకు రాలేదు. ‘జాట్’ చిత్రం కచ్చితంగా ఫుల్ రన్ లో సికందర్ కలెక్షన్స్ ని దాటుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : జాక్ ఫుల్ మూవీ రివ్యూ