Jatadhara Collection Day 4: సుధీర్ బాబు(Sudheer Babu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జటాధర'(Jatadhara Movie) భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా లో సుధీర్ బాబు ని ట్యాగ్ చేసి తిట్టారు. ఆయన కెరీర్ లో మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా ‘జటాధర’ చిత్రం నిలిచిందని, కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లను కూడా ఈ చిత్రం అందుకోవడం కష్టమే అని అనుకున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ ఈ చిత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేయడం గమనార్హం. ట్రేడ్ పండితులు ఇస్తున్న లెక్క ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 4 కోట్ల 50 లక్షలకు జరిగింది. నాలుగు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ ప్రాంతం నుండి 27 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి కేవలం 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 4 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం కోటి షేర్ తో ఆగిపోతుందని అనుకున్న ఈ సినిమా దాదాపుగా 50 శాతం రీకవరీ చేయడం ఆసక్తికరమైన విషయమే. ఈ వీకెండ్ కూడా కాస్త డీసెంట్ హోల్డ్ ని చూపించగలిగితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.
అయితే ఈ చిత్రానికి జరిగిన 4 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం వేల్యూ బిజినెస్ మాత్రమే అట. కానీ నిర్మాతకు ఈ చిత్రాన్ని నిర్మించడానికి 20 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు అయ్యిందట. కేవలం సోనాక్షి సింహా కి 5 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారట. నిర్మాత వైపు నుండి చూస్తే ఇది దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. చూడాలి మరి ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.