Shiva Re Release Advance Bookings: ఈమధ్య కాలం లో ఎక్కడ చూసినా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నే కనిపిస్తున్నాడు. ఆయనతో పాటు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కూడా. తెలుగు చలన చిత్ర పరిశ్రమ రూపు రేఖలను మార్చిన కాంబినేషన్ ఇది. వీళ్ళ కలయిక లో వచ్చిన శివ(Shiva Movie Re Release) చిత్రం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేయడమే కాకుండా, ఒక ట్రెండ్ సెట్టర్ గా కూడా నిల్చింది. ఈ సినిమాలోని స్టాండర్డ్స్ ని చూసి అప్పట్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా షాక్ కి గురయ్యారు. ఇలాంటి కోణం లో కూడా అలోచించి సినిమా తీయొచ్చా అని అప్పట్లో అందరూ నివ్వెరపోయారు. అలాంటి సినిమాని సరికొత్త 4K క్వాలిటీ, డాళ్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో ఈ నెల 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు.
Also Read: సందీప్ వంగ తో రామ్ చరణ్ కొత్త సినిమా..? స్టోరీ లైన్ మామూలు రేంజ్ లో లేదుగా!
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, బెంగళూరు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ నాగార్జున తన కొత్త సినిమాలకు కూడా చూడలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాలీవుడ్ మొత్తం ఈ చిత్రం రీ రిలీజ్ కోసం దిగి వచ్చింది. ఒక్క పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మినహా దాదాపుగా స్టార్స్ అందరూ ఈ చిత్రం గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ వంగ, రామ్ గోపాల్ వర్మ మరియు నాగార్జున కలిసి క్యాంటీన్ లో ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా కోటి 20 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది.
నాగార్జున హీరో గా నటించే కొత్త చిత్రాలకు కూడా ఇంతటి అడ్వాన్స్ బుకింగ్స్ జరగదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటి రోజు కనీసం మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. యూత్ ఆడియన్స్ కి మరింత నచ్చితే లాంగ్ రన్ కూడా అదిరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేటి తరం యువత ఈ సినిమాని అధిక శాతం అసలు చూసి కూడా ఉండరు. కాబట్టి ఫుల్ రన్ లో కూడా ఈ చిత్రం ఇరగ కుమ్మే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి శివ రీ రిలీజ్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించబోతోంది అనేది.