Maa Vande: చాయ్ వాలా నుండి ప్రధాన మంత్రి స్థాయికి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఎదిగిన తీరు అద్భుతం. ఈ ప్రయాణం లో ఆయన ఎదురుకున్న కష్టాలు, ఒడిదుడుగులు ఎలాంటివి అనేది ఎవరికీ తెలియదు. రాజకీయాలను బాగా పరిశీలించే వాళ్లకు నరేంద్ర మోడీ చరిత్ర గురించి కాస్త అవగాహనా ఉంది కానీ, మిగిలిన వాళ్లకు పెద్దగా తెలియదు. కేవలం ఆయన మూడు సార్లు ప్రధాన మంత్రి ఎలా అయ్యాడు అనే విషయం గురించి మాత్రమే నేటి తరం ప్రేక్షకులకు తెలుసు. అందుకే ఆయన జీవిత చరిత్ర ని ఎవరైనా సినిమాగా తీస్తే చూడాలని నరేంద్ర మోడీ ని అభిమానించే వాళ్ళు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెరదించుతూ, ప్రముఖ మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందం నరేంద్ర మోడీ బయోపిక్ లో హీరో గా నటించేందుకు సిద్దమయ్యాడు. ఈ చిత్రానికి టైటిల్ ‘మా వందే’.
Also Read: సందీప్ వంగ తో రామ్ చరణ్ కొత్త సినిమా..? స్టోరీ లైన్ మామూలు రేంజ్ లో లేదుగా!
ఈ చిత్రానికి క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. నరేంద్ర మోడీ బాల్యం నుండి, ప్రధాని వరకు ఆయన ప్రయాణం ని వెండితెర పై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గా ఉన్ని ముకుందన్ లుక్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రం లో నరేంద్ర మోడీ కి తల్లి పాత్రలో రవీనా తాండన్ నటించబోతోంది అంటూ లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. మోడీ కుటుంబం గురించి ఎవరికీ అవగాహన ఉండేది కాదు. ఆయనకు భార్య పిల్లలు కూడా లేరు. కానీ ఆయనకు ఒక తల్లి ఉంది అనే విషయం మాత్రం జనాలకు తెలుసు. ఈమె 2022 వ సంవత్సరం లో 99 ఏళ్ళ వయస్సులో చనిపోయింది. ఒక మనిషి 99 ఏళ్ళు ఈ కాలం లో బ్రతకడమంటే చిన్న విషయం కాదు. ప్రధానిగా మోడీ చేసిన సేవలు, జనాల ఆశీస్సుల రూపం లో ఆయన తల్లికి ఆయుష్షు పెంచిందని మోడీ అభిమానులు గర్వంగా చెప్తుంటారు. అలాంటి పవర్ ఫుల్ వ్యక్తిని కన్న పాత్రలో రవీనా తాండన్ ఎలా నటించబోతుందో చూడాలి. ఈమె పేరు నేటి తరం ఆడియన్స్ కి పెద్దగా తెలియక పోవచ్చు. రవీనా అంటే మరెవరో కాదు, KGF సిరీస్ లో ప్రధానమంత్రి క్యారక్టర్ చేసిన పవర్ లేడీ గుర్తుంది కదా?, ఆమెనే ఈమె. ఆ సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా కనిపించిందో, మోడీ తల్లి పాత్రలో ఇప్పుడు శాంతంగా కనిపించనుంది.