Jatadhara Collection Day 1: కెరీర్ మొత్తం సినిమాల మీద సినిమాలు చేస్తూ, ఒకదానిని మించి ఒకటి అన్నట్టుగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ, తనకంటూ ఒక మార్కెట్ ని ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరో సుధీర్ బాబు(Sudheer Babu). ప్రతీ సినిమాకు తన వైపు నుండి నూటికి నూరు శాతం కష్టం అయితే పడుతాడు కానీ, ఫలితం మాత్రం దొరకడం లేదు. ఇక నేడు ఆయన హీరో గా నటించిన ‘జటాధర'(Jatadhara Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ ని చూసిన తర్వాత ఆడియన్స్ ఈసారి సుధీర్ బాబు కచ్చితంగా హిట్ కొడుతాడేమో అని అంతా అనుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.
Also Read: ‘పెద్ది’ సినిమాకు జాన్వీ కపూర్ పెద్ద మైనస్ కానుందా..? హీరోయిన్ ని చూపించే విధానం అదేనా!
ట్రేడ్ విశ్లేషకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రం మొదటి రోజున కోటి రూపాయిల థియేట్రికల్ షేర్ ని కూడా సొంతం చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇలా ఇప్పటి వరకు ఈ సినిమాకు కూడా జరగలేదు. కనీసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక్క షో చూసేందుకు థియేటర్స్ కి వెళ్లినా ఈ చిత్రానికి మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చి ఉండేవి. కానీ మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని ఆదరించలేదు. ఫలితంగా డిజాస్టర్ ఫలితాన్ని చూడాల్సి వచ్చింది. సినిమాలో నటీనటుల నటన, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఇలా ప్రతీ ఒక్కటి తేలిపోయే రేంజ్ లో ఉందని, ఇంతటి దారుణమైన సినిమాని ఈమధ్య కాలం లో చూడలేదని చూసిన ఆ కొద్దిమంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్ బాబు కి సినిమాల మీద ఇష్టం ఉండొచ్చు కానీ, ఆయనకు అచ్చిరానప్పుడు అనవసరంగా సినిమాల్లో కొనసాగడం సమయం వృధా అంటూ మహేష్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.