Mass Jathara Collection Day 6: వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ ముందుకెళ్తున్న రవితేజ(Mass Maharaja Raviteja) కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిల్చిన చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara Movie). పాన్ ఇండియన్ సినిమాలు రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో, ఆడియన్స్ కి ఏ మాత్రం ఆసక్తి కలిగించని రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు ఇంకోసారి చేస్తే, దీనికంటే పెద్ద ఫ్లాప్ ని అందిస్తాం అనే సందేశాన్ని రవితేజకి ఈ చిత్రం ద్వారా పంపించారు ఆడియన్స్. రవితేజ గత చిత్రంతో పోలిస్తే మాస్ జాతర చిత్రానికి సగం కూడా బిజినెస్ జరగలేదు . ‘మిస్టర్ బచ్చన్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే, ‘మాస్ జాతర’ చిత్రానికి కనీసం 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగలేదు. అయినప్పటికీ ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టమైంది. మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఆరు రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.
Also Read: ‘పెద్ది’ సినిమాకు జాన్వీ కపూర్ పెద్ద మైనస్ కానుందా..? హీరోయిన్ ని చూపించే విధానం అదేనా!
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల 20 లక్షల రూపాయిలు వస్తే, ఇతర ప్రాంతాల నుండి మరో రెండు కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక షేర్ వసూళ్లు చూస్తే దాదాపుగా 9 కోట్ల 83 లక్షల రూపాయిలు వచ్చినట్టు సమాచారం. ప్రాంతాల వారీగా వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ నుండి కోటి 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, ఆంధ్ర ప్రాంతం నుండి 3 కోట్ల 73 లక్షలు షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కు కలిపి 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 49 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 9 కోట్ల 87 లక్షలు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం మరో 10 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఇక కేవలం రెండు నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బయ్యర్స్ కి 7 నుండి 8 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.