Kantara 2 Closing Collections: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘కాంతారా 2′(Kanthara : the chapter 1). కాంతారా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి ప్రీక్వెల్ కావడం తో ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండేవి. అంతటి అంచనాలను అందుకోవడం ఏ సినిమాకు అయినా కష్టమే. కానీ ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండే అలాంటి అద్భుతమైన టాక్ వచ్చింది. ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్నప్పటికీ, 90 శాతం కి పైగా సెంటర్స్ లో షేర్ వసూళ్లు రావడం ఆగిపోవడం తో బయ్యర్స్ క్లోజింగ్ కలెక్షన్స్ వేసేసారు. ఇతర భాషల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే సంగతి కాసేపు పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం బయ్యర్స్ కి భారీ నష్టాన్ని కలిగించాయి.
Also Read: ‘పెద్ది’ సినిమాకు జాన్వీ కపూర్ పెద్ద మైనస్ కానుందా..? హీరోయిన్ ని చూపించే విధానం అదేనా!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే నైజాం ప్రాంతం లో 31 కోట్ల 65 లక్షలు,సీడెడ్ ప్రాంతం లో 9 కోట్ల 78 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 9 కోట్ల 8 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 90 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2 కోట్ల 73 లక్షలు, గుంటూరు నుండి 3 కోట్ల 55 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 4 కోట్లు, నెల్లూరు జిల్లా నుండి 2 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 66 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 91 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా పాతిక కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వాటిల్లాయి.
మన టాలీవుడ్ లో ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఇంత మొత్తం నష్టపోవడం ఇదే తొలిసారి. ఇక ఇతర రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ లో వచ్చిన వసూళ్లను చూస్తే కర్ణాటక ప్రాంతం నుండి 245 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళనాడు నుండి 71 కోట్ల 75 లక్షలు, కేరళ నుండి 55 కోట్ల 68 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 251 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లెక్కలు చూస్తే దాదాపుగా 110 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు మరియు అన్ని భాషలకు కలిపి 840 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.