Atlee Allu Arjun Movie: ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది అట్లీ అనే చెప్పాలి. తమిళంలో స్టార్ డైరెక్టర్లందరు ఔట్ డేటెడ్ అయిపోతున్నారు. వాళ్ళందరు మూస ధోరణిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం వల్ల వాళ్ళ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే అట్లీ లాంటి దర్శకుడు మాత్రం ఎమోషన్స్ తో సినిమాలను ముందుకు లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టే అతని సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఇక షారుక్ ఖాన్ తో ఆయన చేసిన ‘జవాన్’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సరే గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి అట్లీ కమర్షియల్ సినిమాలను చాలా బాగా హ్యాండిల్ చేయగలడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా భారీ విజువల్స్ తో గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాతో ఆయన గ్రాఫిక్స్ ఉన్న సన్నివేశాలను ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు అనేది ఎప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇందులో ఏమాత్రం మిస్టేక్ చేసినా కూడా అట్లీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అందుకే అట్లీ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని తన అభిమానులు సైతం ఆయన్ని హెచ్చరిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాకి పనులను చేయించుకుంటున్న అట్లీ మొత్తానికైతే తను అనుకున్నట్టుగా ఈ సినిమాను తీయగలుగుతున్నాను అనే ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నాడట.
ఇప్పటివరకు 30% షూటింగ్ కంప్లీట్ చేసిన అట్లీ తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ ను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇకమీదట ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా విజువల్ వండర్ గానే తెరకెక్కబోతున్నాయి అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో కనక విజయాన్ని సాధిస్తే మాత్రం అట్లీ కూడా పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మరోసారి తన సత్తా చాటుకున్నవాడవుతాడు లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…