https://oktelugu.com/

Janhvi Kapoor :  రామ్ చరణ్ సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన జాన్వీ కపూర్.. ఒక్కరోజుకి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా!

జాన్వీ కపూర్ డ్యాన్స్ చూసిన తర్వాత అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ చిత్రం ఇంకా విడుదల కూడా కాలేదు, అప్పుడే జాన్వీ కపూర్ కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కడుతున్నాయి. 'దేవర' చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈమెకి రామ్ చరణ్ - బుచ్చి బాబు చిత్రం లో హీరోయిన్ ఛాన్స్ దక్కింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 09:54 PM IST

    Janhvi Kapoor

    Follow us on

    Janhvi Kapoor : మహానటి, అతిలోక సుందరి శ్రీదేవి గారి కుమార్తె గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ కూడా యూత్ లో ఈమె క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. కేవలం శ్రీదేవి కూతురు అయితే వచ్చే క్రేజ్ కాదు ఇది. ఆమెలో ఆ స్థాయి టాలెంట్, అందం ఉంది. బాలీవుడ్ డైరెక్టర్స్ ఆమెని సరిగా ఉపయోగించుకోలేదు అని చాలామంది అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈమె టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆమె లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’, ‘దావూది’ సాంగ్స్ లో ఈమె ఎన్టీఆర్ తో సమానంగా డ్యాన్స్ చేసి రచ్చ చేసింది. ఎన్టీఆర్ స్పీడ్ ని మ్యాచ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. డ్యూయెట్స్ లో ఆయన స్పీడ్ ని హీరోయిన్స్ తట్టుకోలేరు కాబట్టి కొరియోగ్రాఫర్స్ ఈమధ్య ఎన్టీఆర్ తో సులభమైన స్టెప్పులు వేయిస్తున్నారు.

    కానీ జాన్వీ కపూర్ డ్యాన్స్ చూసిన తర్వాత అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ చిత్రం ఇంకా విడుదల కూడా కాలేదు, అప్పుడే జాన్వీ కపూర్ కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కడుతున్నాయి. ‘దేవర’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈమెకి రామ్ చరణ్ – బుచ్చి బాబు చిత్రం లో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. అయితే ఈ సినిమాకి ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ని చూసి నిర్మాతలు షాక్ అయ్యారు. కానీ ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదు అని డైరెక్టర్ బుచ్చి బాబు పట్టుబట్టడం తో భారీ రెమ్యూనరేషన్ కి ఒప్పుకోని జాన్వీ కపూర్ ని తీసుకున్నారు నిర్మాతలు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం ఆమె 8 కోట్ల రూపాయిలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ‘దేవర’ చిత్రానికి ఆమె కేవలం నాలుగు కోట్ల రూపాయిలు మాత్రమే తీసుకుంది. కానీ టాలీవుడ్ లో ఆమెకి ఏర్పడిన డిమాండ్ కారణంగా ఈ దానికి డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

    ఇది ఇలా ఉండగా నాని ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని డైరెక్టర్ అనుకున్నాడు. ఆమెని సంప్రదించగా, ఓకే చెప్పింది కానీ 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసింది. అంత ఇచ్చుకోలేము అని నిర్మాతలు వెనుతిరిగారట. డిమాండ్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు రెమ్యూనరేషన్ పెంచేస్తే భవిష్యత్తులో అవకాశాలు ఉండవని, జాన్వీ కపూర్ ఇది ఆలోచించుకోవాలని అంటున్నారు విశ్లేషకులు. బాలీవుడ్ లో ఈమెకు నిర్మాతలు రెండు కోట్ల రూపాయలకు మించి రెమ్యూనరేషన్ ఇవ్వరు, కానీ ఇక్కడ మాత్రం ఆమె ఫ్యూజులు ఎగిరే రేంజ్ రెమ్యూనరేషన్స్ ని డిమాండ్ చేస్తుంది.