https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి అభయ్ అవుట్.. 3 వారాలకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడారు, ఒక్క అభయ్ తప్ప. టాస్కులు ఆడి ఓడిపోయినా పర్వాలేదు, ఒక క్లాన్ కి చీఫ్ గా వ్యవహరిస్తూ, నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మూలాన కూర్చొని రేలంగి మావయ్య వేషాలు వేయడం ఆడియన్స్ కి చిరాకు కలిగించింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 10:06 PM IST

    Bigg Boss telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత హీట్ వాతావరణం మధ్య సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, వీకెండ్స్ లో నాగార్జున ఇచ్చే కోటింగ్ ఇలా ప్రతీ అంశం కూడా ఈ సీజన్ లో అదిరిపోయాయి. ప్రారంభం లో ఇంత నిదానంగా ఈ షో నడుస్తుందేంటి, సీజన్ 7 లాగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే, సీజన్ 6 లాగా డిజాస్టర్ అయ్యేలా ఉంది అని అనుకున్నారు. కానీ మూడవ వారం లో టాస్కులు అదిరిపోయాయి. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడారు, ఒక్క అభయ్ తప్ప. టాస్కులు ఆడి ఓడిపోయినా పర్వాలేదు, ఒక క్లాన్ కి చీఫ్ గా వ్యవహరిస్తూ, నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మూలాన కూర్చొని రేలంగి మావయ్య వేషాలు వేయడం ఆడియన్స్ కి చిరాకు కలిగించింది.

    నిన్న జరిగిన ఎగ్స్ టాస్కు లో అభయ్ ఎలా ప్రవర్తించాడో మనమంతా చూసాము. అవతల క్లాన్ కి సంబంధించిన వాళ్ళు ఈయన వద్దకు వచ్చి గుడ్లు దోచుకొని వెళ్తుంటే, తీసుకెళ్లండి, పండగ చేసుకోండి అంటూ తేలికగా వదిలేసాడు. అవతల యష్మీ, ప్రేరణ, మణికంఠ క్రూరంగా ఆడుతున్న నిఖిల్ క్లాన్ సభ్యులతో పోరాడి, అంత కష్టపడి గుడ్లను గెలుచుకుంటే అభయ్ ఇంత తేలికగా వదిలేయడం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతే కాకుండా బిగ్ బాస్ ని దుర్భాషలాడడం కూడా అభయ్ ని చాలా నెగటివ్ చేసింది. ఈ వారం ఆయన నామినేషన్స్ లోకి చాలా ఓవర్ కాంఫిడెన్స్ తో వచ్చాడు. నన్ను ప్రేక్షకులు సేవ్ చేస్తారు అనే నమ్మకం తో ఉన్నాడు. కానీ ఆయన కంటెస్టెంట్ గా ఈ వారం ఫెయిల్, చీఫ్ గా అయితే డిజాస్టర్. అందుకే రోజువారీ ఓట్లు ఆయనకీ బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈయన డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈ వారం ఈయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు నూటికి 99 శాతం ఉంది. దీంతో మూడు వారాలకు గాను ఇతను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    సినిమాల్లో కాస్త మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ అవ్వడంతో అభయ్ కి వారానికి 3 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తామని ఒప్పందం చేసుకుంది బిగ్ బాస్ టీం. ఒప్పందం ప్రకారం ఆయనకీ వారానికి 3 లక్షలు ఇస్తున్నారు. అంటే 3 వారాలకు 9 లక్షల రూపాయిలు అన్నమాట. వాస్తవానికి అభయ్ మంచి పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి, ఆయన గేమ్ ని సరిగ్గా ఆడుంటే కచ్చితంగా టాప్ 5 లోకి వచ్చేవాడు. కానీ ఈయన బిగ్ బాస్ లో కేవలం రిలాక్స్ అవ్వడం కోసం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ మూడు వారాల్లో ఈయన ఆడిన టాస్కులు ఒక్క రెండు చెప్పమంటే చెప్పలేని పరిస్థితి, దానికి తోడు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెట్టడం, ఇలా ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కూడా లేకపోవడం వల్లే ఆయన ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నాడు.