అతిలోక సుందరి ‘శ్రీదేవి’ మొదటిసారి తల్లి అయినప్పటి నుండి ఆమెకు ఓ కోరిక చాల బలంగా ఉండేదట. తన ముద్దుల తనయ జాన్వీని సౌత్ లో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాలని. కానీ విధి కాటులో జాన్వీ మొదటి సినిమా దఢక్ ను చూసుకోకుండానే శ్రీదేవి ఈ లోకం నుండి వెళ్ళిపోయింది. అయితే తానూ సౌత్ లో సినిమాలు చేయాలనే తన తల్లి శ్రీదేవి కోరికను తీర్చడానికి ప్రస్తుతం జాన్వీ కసరత్తులు చేస్తోందట. తన కోరిక తీరకుండానే శ్రీదేవి కన్ను మూసినా.. ఆమె కోరికను జాన్వీ తీర్చబోతుంది అన్నమాట.
ఎలాగూ శ్రీదేవి మరణించిన తరువాత జాన్వీ మొదటి చిత్రం ధఢక్ రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. కానీ కూతురు సక్సెస్ ను శ్రీదేవి ఎంజాయ్ చేయలేకపోవడం అనేది జాన్వీకి ఇప్పటికీ తీరని బాధ అట. అందుకే సౌత్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకుని మొత్తానికి తన తల్లి చిరకాల కోరికను తీర్చాలని జాన్వీ పట్టుదలగా ఉంది. కాగా బోనీ కపూర్ ఇప్పటికే జాన్వీ కోసం ఒక తమిళ సినిమాని సెట్ చేసినట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాతో జాన్వీని సౌత్ లో పరిచయం చేయాలని బోనీ ప్లాన్ చేస్తున్నాడు.
నిజానికి సౌత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఉన్నట్టు గతంలో జాన్వీ కపూర్ అనేక సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. దర్శకుడు పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తోన్న లైగర్ సినిమాలో మొదట హీరోయిన్ గా జాన్వీనే అనుకున్నారు. జాన్వీ కూడా విజయ్ దేవరకొండతో నటించడానికి అంగీకరించింది. అయితే బోనీ కపూర్ కి మాత్రం సౌత్ లో నెంబర్ వన్ స్టార్ హీరో సరసనే జాన్వీని హీరోయిన్ గా సౌత్ ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆశ. ఆ ఉద్దేశ్యంతో.. అప్పుడు విజయ్ దేవరకొండ సినిమాని రిజక్ట్ చేశాడు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాని జాన్వీకి సెట్ చేశాడు.