Janhvi Kapoor: అందాల ప్రదర్శనే లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది జాన్వీ కపూర్. శృతి మించిన స్కిన్ షోతో తల్లి శ్రీదేవి పరువు తీసేస్తుంది. శ్రీదేవి బ్రతికుంటే చాలా బాధపడేది అన్నట్లు జాన్వీ తీరుంది. రోజు రోజుకూ జాన్వీ అందాల ప్రదర్శన హద్దులు దాటేస్తుంది. జాన్వీని స్టార్ హీరోయిన్ గా చూడాలనుకుంది శ్రీదేవి. వెండితెరపై తన వారసురాలిని చూసి మురిసిపోవాలి అనుకుంది. అనుకోని ప్రమాదం కోరిక తీరకుండానే అనంత లోకాలకు తీసుకుపోయింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్ లోని ఒక హోటల్ లో మరణించారు.

శ్రీదేవి మరణించేనాటికి జాన్వీ డెబ్యూ మూవీ దఢక్ షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో జాన్వీని సిల్వర్ స్క్రీన్ పై చూసే అదృష్టం శ్రీదేవికి దగ్గలేదు. తన పోలికలు కలిగి ఉండే జాన్వీ అంటే శ్రీదేవికి చాలా ఇష్టం. ఇక శ్రీదేవి వారసురాలిగా తల్లి పేరు నిలబెడుతుంది అనుకుంటే జాన్వీలో ఆ సూచనలు కనిపించడం లేదు. జాన్వీకి బ్రేక్ ఇచ్చే ఒక్క చిత్రం పడలేదు.

స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదు. కనీసం కమర్షియల్ చిత్రాల్లో జాన్వీకి ఆఫర్స్ దక్కకపోవడం నిరాశపరుస్తుంది. దఢక్, గుంజన్ సక్సేనా, రూహి ఇలా ఆమె నటించిన చిత్రాలన్నీ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. జాన్వీ కంటే సారా అలీ ఖాన్ బెటర్ అనిపిస్తుంది. ఆమె కెరీర్లో ఒకటి రెండు హిట్స్ ఉన్నాయి. జాన్వీకి మాత్రం పేరు తెచ్చే ఒక్క సినిమా పడలేదు. ఆమె ప్రయోగాలు ప్రయోజనం ఇవ్వడం లేదు.

అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శనకు తెరలేపుతోంది. మరోవైపు సౌత్ ఆడియన్స్ ఆమె ఒక చిత్రం చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. శ్రీదేవి కూతురిగా టాలీవుడ్ స్టార్ తో జతకట్టాలని కోరుకుంటున్నారు. తెలుగు సినిమాలో జాన్వీ నటిస్తున్నారంటూ పుకార్లు వినిపించినా, అవి కార్యరూపం దాల్చలేదు. అలాగే ఆమెకు సౌత్ చిత్రాల పట్ల ఆసక్తి లేదన్న ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లను జాన్వీ ఖండించడం విశేషం. మరి జాన్వీ తెలుగులో అడుగుపెట్టే రోజు ఎప్పుడొస్తుందో చూడాలి. ఇక జాన్వీ లేటెస్ట్ మూవీ మిల్లీ విడుదలకు సిద్ధమైంది. ఇది మరో ప్రయోగాత్మక చిత్రమని తెలుస్తుంది. మిల్లీ నవంబర్ 4న విడుదల కానుంది.