Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం , సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో విడుదల ఆగిపోయింది. సుమారుగా ఆరు నెలల బ్రేక్ తర్వాత ఈ చిత్రం అన్ని ఇక్కట్లను తొలగించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు అప్పట్లో ఉన్న ఊపు, ఇప్పుడు అసలు కనిపించడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో అయితే ఈ సినిమా దారుణంగా దెబ్బ తినింది. ఓవర్సీస్ లో జనవరి 9 న విడుదల అన్నప్పుడు , రెండు రోజులకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది.
కానీ ఇప్పుడు రెండు రోజుల్లో విడుదల అనగా, ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి కేవలం 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇది చాలా తక్కువ , అంచనాలను తలక్రిందులు చేసింది అనే చెప్పాలి. ఉదాహరణకు నార్త్ అమెరికా నే తీసుకుందాం. గతం లో ఈ చిత్రం విడుదలకు రెండు రోజులకు ముందు 4 లక్షల 41 వేల డాలర్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. కానీ ఇప్పుడు కేవలం 2 లక్షల 29 వేల డాలర్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. అంటే ముందుతో పోలిస్తే 60 శాతం వసూళ్లు తగ్గాయి అన్నమాట. దీన్ని బట్టీ ఈ చిత్రం పై విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన ఎఫెక్ట్ బలంగా పడింది అనే చెప్పాలి. 6 నెలల క్రితం విజయ్ సినిమాలను అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు చూసేవారు. కానీ ఆయన సీఎం అయ్యాక DMK , అన్నా డీఎంకే పార్టీలకు చెందిన వారు పూర్తిగా ఆయన సినిమాలను దూరం పెట్టేసారు.
ఆ ఫలితం ‘జన నాయగన్ ‘ పై స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా 4 నెలల క్రితమే పైరసీ కి గురి అవ్వడం కూడా, చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించింది అనే చెప్పాలి. ఆన్లైన్ లో హై క్వాలిటీ ప్రింట్ రావడం వల్ల , ఈ చిత్రాన్ని తమిళ ఆడియన్స్ ముందుగానే వీక్షించారు. అందుకే ఇప్పుడు భారీ వసూళ్లు నమోదు అవ్వడం లేదు. తమిళనాడు బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 18 కోట్ల రూపాయిలు మాత్రమే . అందులో తమిళ వెర్షన్ గ్రాస్ 16 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి రేపు అడ్వాన్స్ బుకింగ్స్ ముగిసేలోపు 45- నుండి 50 కోట్ల మధ్యలో గ్రాస్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విడుదల తర్వాత 70 నుండి 80 కోట్ల ఓపెనింగ్ రావొచ్చని అంటున్నారు విశ్లేషకులు.






