Site icon OkTelugu

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే ..

Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం , హిందీ , మలయాళం భాషల్లో విడుదలైంది. ఎప్పుడో ఆరు నెలల క్రితమే విడుదల అవ్వాల్సిన ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయో అందరికీ తెలుసు. అంతే కాకుండా ఎన్నికల ముందు పైరసీ కి కూడా గురైంది ఈ చిత్రం. అలా ఏ సినిమాకు ఎదురవ్వని ఇక్కట్లు ఈ చిత్రానికి ఎదురయ్యాయి. ఎట్టకేలకు వాటిని విజయవంతంగా దాటుకొని నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ రావడం గమనార్హం. ఇలాంటి టాక్ ఈమధ్య కాలం లో విజయ్ సినిమాలకు రాలేదు. గడిచిన 15 ఏళ్ళ నుండి ఆయన కెరీర్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో కొనసాగుతూ వచ్చింది.

అయితే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా , ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఓపెనింగ్స్ పెద్దగా లేవు కానీ , తమిళనాడు లో మాత్రం దుమ్ము లేచిపోయింది అనే చెప్పొచ్చు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 32 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. 4 నెలల క్రితం లీకైన ఒక సినిమాకు ఈ రేంజ్ లో టికెట్లు అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. పైగా ఈ చిత్రం ‘భగవంత్ కేసరి’ కి రీమేక్. ఈమధ్య కాలం లో ఆడియన్స్ రీమేక్ సినిమాలకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. విజయ్ చివరి చిత్రం, ఆయన్ని చివరిసారిగా వెండితెర పై చూసుకోవాలి అనే ఆశతోనే ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతున్నారు. ఇకపోతే ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా మ్యాట్నీ షోస్ వరకు నమోదైన గ్రాస్ ఎంతో ఒకసారి చూద్దాం.

ముందుగా నెట్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే హిందీ వెర్షన్ నుండి 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు నమోదు అవ్వగా, తెలుగు నుండి 1 కోటి 70 లక్షలు , తమిళం నుండి 23 కోట్ల 50 లక్షలు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 26 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు , 30 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మ్యాట్నీ షోస్ వరకు నమోదు అయ్యాయి. సెకండ్ షోస్ ముగిసేసరికి మొదటి రోజు ఈ చిత్రానికి ఆన్లైన్ ద్వారా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు కేవలం ఇండియా నుండి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని , ఓవర్సీస్ నుండి 30 కోట్ల గ్రాస్, ఓవరాల్ గా 90 నుండి 100 కోట్ల మధ్యలో గ్రాస్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Exit mobile version