ప్రపంచ సినీ వేదిక మీద భారతీయ సినిమాకు నిరాశ !

‘జల్లికట్టు’.. మన దేశం తరఫున 93వ ఆస్కార్‌ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఎన్నికైన ఏకైక నేటివిటీ సినిమా ఇది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ మలయాళ సినిమాను ఎంట్రీగా పంపించినప్పుడు.. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2021 ఆస్కార్ బరిలోకి దిగేందకు అన్ని భారతీయ భాషల్లో కలిపి మొత్తం 27 సినిమాలు పోటీపడగా, చివరకు ‘జల్లికట్టు’ ఎంపికవ్వడం గొప్పగానే భావించారు. కానీ మరోసారి భారత సినిమాకు నిరాశే ఎదురైంది. మన దేశం నుంచి […]

Written By: admin, Updated On : February 11, 2021 4:08 pm
Follow us on


‘జల్లికట్టు’.. మన దేశం తరఫున 93వ ఆస్కార్‌ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఎన్నికైన ఏకైక నేటివిటీ సినిమా ఇది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ మలయాళ సినిమాను ఎంట్రీగా పంపించినప్పుడు.. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2021 ఆస్కార్ బరిలోకి దిగేందకు అన్ని భారతీయ భాషల్లో కలిపి మొత్తం 27 సినిమాలు పోటీపడగా, చివరకు ‘జల్లికట్టు’ ఎంపికవ్వడం గొప్పగానే భావించారు. కానీ మరోసారి భారత సినిమాకు నిరాశే ఎదురైంది. మన దేశం నుంచి 93వ ఆస్కార్ అవార్డులకు బరిలో నిలిచిన ‘జల్లికట్టు’ సినిమా తుది రౌండకు అర్హత సాధించలేకపోవడం అభిమానులను నిరాశ పరిచింది.

Also Read: హైపర్ ఆది పెళ్లి.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

కాగా సామాజిక నేపథ్య కథాంశంతో జోస్ పెల్లీస్సరీ ‘జల్లికట్టు’ను తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. 2019లో వచ్చిన ఈ సినిమా ఇంకా పలు భాషా ప్రేక్షకులను అలరిస్తూ మెప్పిస్తూనే ఉంది. పైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జల్లికట్టు సినిమాకుగానూ.. ఉత్తమ దర్శకుడిగా జోస్ పెల్లీస్సరీ అవార్డు అందుకున్నాడు. దాంతో ఆస్కార్ రేంజ్ లో కూడా ఈ సినిమా మరో ఘనత సాధిస్తోందని అనుకున్నారు. కానీ ఆ ఆశ నిరాశగానే ముగిసింది. ఇక ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రలలో అద్భుతంగా నటించారు.

Also Read: ‘ఆదిపురుష్’ కు పోటీగా ‘రామాయ‌ణ్‌’.. రాముడిగా మ‌హేష్‌.. హ‌న‌మంతుడిగా బ‌న్నీ?

ముఖ్యంగా ఈ సినిమా కథ విషయానికి వస్తే… కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న ఓ దున్నపోతు ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఎంతటి వినాశనం చేసిందనేది సినిమా మెయిన్ పాయింట్. సినిమా మొత్తం ఒక దున్నపోతు చుట్టూ తిరిగినా, సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోవడం, అలాగే సినిమాలో ఎక్కడా దున్నపోతును ఉపయోగించకపోవడం గమనార్హం. చిత్రయూనిట్ యానిమేట్రానిక్స్ ద్వారా ఓ దున్నపోతును తయారు చేసి వాడరు. అంటే, ఒక్కో దున్నపోతుకు సుమారు 20 లక్షలు ఖర్చు అయ్యిందట. సినిమా కోసం అంట కష్ట పడ్డారు కాబట్టే.. ఇది గొప్ప సినిమా అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్