శివుని ప్రసన్నం కొరకు మహిళ సజీవ సమాధి.. చివరకు..?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కు సమీపంలో మఢా అనే గ్రామంలో ఉన్న 52 సంవత్సరాల వయస్సు గల గౌతమి చేసిన పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శివుడు ప్రసన్నం అవుతాడని ఇంటి బయట త్రిశూలం చేతపట్టి మహిళ సజీవ సమాధి అయింది. అయితే విషయం అధికారులకు తెలియడంతో అధికారులు ఎంతో కష్టపడి ఆ మహిళ ప్రాణాలు పోకుండా కాపాడారు. అధికారులు రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే మాత్రం సదరు మహిళ ప్రాణాలు కోల్పోయేది. […]

Written By: Navya, Updated On : February 11, 2021 5:26 pm
Follow us on

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కు సమీపంలో మఢా అనే గ్రామంలో ఉన్న 52 సంవత్సరాల వయస్సు గల గౌతమి చేసిన పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శివుడు ప్రసన్నం అవుతాడని ఇంటి బయట త్రిశూలం చేతపట్టి మహిళ సజీవ సమాధి అయింది. అయితే విషయం అధికారులకు తెలియడంతో అధికారులు ఎంతో కష్టపడి ఆ మహిళ ప్రాణాలు పోకుండా కాపాడారు. అధికారులు రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే మాత్రం సదరు మహిళ ప్రాణాలు కోల్పోయేది.

Also Read: ఈ పాస్‌వర్డ్‌ లు వాడుతున్నారా.. ప్రమాదంలో పడినట్లే..?

పూర్తి వివరాల్లోకి వెళితే మడా గ్రామానికి చెందిన గౌతమికి చిన్నప్పటి నుంచి శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించేది. దేవునికి రోజూ పూజలు చేస్తున్న గౌతమి తానే శివుని అవతారమని.. తనకు శివుడు కనిపిస్తున్నాడని చుట్టుపక్కల వాళ్లకు, బంధువులకు తెలిపింది. ఆ తరువాత రెండు రోజుల పాటు ఆమె తనను తాను సజీవ సమాధి చేసుకోబోతున్నట్టు కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపింది.

Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే ఛాన్స్..?

ఆమె కుటుంబ సభ్యులు సైతం మహిళ సజీవ సమాధి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళ సజీవ సమాధి కొరకు నాలుగు అడుగుల లోతు, ఐదు అడుగుల వెడల్పు ఉన్న గొయ్యి తీశారు. నిన్న ఉదయం 10 గంటల సమయంలో మహిళ తలపై కిరీటం ధరించి, ఎర్రటి చీరతో త్రిశూలం పట్టుకుని గొయ్యిలో కూర్చుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు గొయ్యిని కర్రలతో కప్పి ఆ కర్రలపై మట్టిని పోశారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఆ తరువాత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భజనలు, కీర్తనలు పాడారు. ఈ ఘటన జరిగిన మూడు గంటల తరువాత ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాధిలో ఉన్న మహిళను బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ కోలుకుందని తెలుస్తోంది. మూఢనమ్మకంతో మహిళ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది.