Anirudh Ravichander: జైలర్ సక్సెస్… అనిరుధ్ కి జైలర్ నిర్మాత ఊహించని బహుమతి! ధరెంతో తెలుసా!

ఇప్పటికే హీరో రజినీకాంత్ కు భారీ అమౌంట్ చెక్, ఖరీదైన కారు బహుకరించిన నిర్మాత మారన్, ఆ తర్వాత సినిమా దర్శకుడు నెల్సన్ కు కూడా చెక్, కారును అందించాడు.

Written By: Shiva, Updated On : September 5, 2023 4:00 pm

Anirudh Ravichander

Follow us on

Anirudh Ravichander: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఇప్పటికే 600 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ఇంకా అనేక చోట్ల మంచి వసూళ్లు సాధించటం విశేషం. ఇంతది భారీ విజయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చాలా ఘనంగా సెలెబ్రిట్ చేసుకుంటుంది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన వాళ్లకు నిర్మాత కళానిధి మారన్ లాభాల్లో వాటాలు ఇవ్వటమే కాకుండా, భారీ ధర కలిగిన కార్లను కూడా గిఫ్ట్ గా ఇస్తున్నాడు.

ఇప్పటికే హీరో రజినీకాంత్ కు భారీ అమౌంట్ చెక్, ఖరీదైన కారు బహుకరించిన నిర్మాత మారన్, ఆ తర్వాత సినిమా దర్శకుడు నెల్సన్ కు కూడా చెక్, కారును అందించాడు. తాజాగా జైలర్ సినిమాకు మరో పిల్లర్ గా నిలిచిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ కు కూడా చెక్ మరియు ఖరీదైన ఫోర్షియో కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ధర 1.86 కోట్ల నుండి 4 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. దానిని సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

అనిరుధ్ ను స్వయంగా నిర్మాత మారన్ కలిసి చెక్ అందచేసి, ఖరీదైన మూడు ఫోర్షియో కారులను అనిరుద్ ముందు ఉంచాడు. వాటిలో అనిరుధ్ కు నచ్చిన కారు తాళాలను నిర్మాత కళానిధి మారన్ అందచేశారు. నిజానికి సినిమా విడుదలకు ముందే ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రెమ్యూనరేషన్ క్లియర్ చేసింది నిర్మాణ సంస్థ. జైలర్ సినిమా ఊహించని స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇందులో కీలకంగా వ్యవహరించిన వాళ్లకు లాభాల్లో వాటాలు ఇస్తున్నాడు నిర్మాత మారన్.

ఆగస్టు 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన జైలర్ సినిమా. అన్ని చోట్ల ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించటం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఇక తెలుగులో సూపర్ స్టార్ స్టామినా ఏమిటో మరోసారి రుజువు చేసింది జైలర్ సినిమా. అదే విధంగా మలయాళంలో కూడా 50 కోట్లకు పైగా వసూళ్లు చేసి అక్కడ రికార్డు సృష్టించింది జైలర్.