PM Modi-Annamalai : తమిళనాటనే ద్రవిడవాదానికి నూకలు చెల్లే రోజు దగ్గరలో

తమిళనాటనే ద్రవిడవాదానికి నూకలు చెల్లే రోజు దగ్గరలో ఉందనడానికి ‘అన్నామలై’ పాదయాత్ర.. ఆయనకు వస్తున్న స్పందనే కారణం..

Written By: NARESH, Updated On : September 5, 2023 3:26 pm

PM Modi-Annamalai తమిళనాట జరుగుతున్న రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకనాడు పెరియార్ నాయకర్ ఏం చెప్పినా కూడా అది తమిళ సమాజం భరించింది.. బ్రాహ్మణులను తిట్టినా.. వెలివేసినా.. కొట్టినా.. గెంటేసినా.. రాముడికి చెప్పుల దండలు వేసినా.. తమిళ సమాజం కిమ్మనకుండా నోరుమూసుకొని ఉంది. పెరియర్ ది తాత్విక చింతననా? అన్నది ఆలోచించాలి.

బ్రిటీష్ వారు నాడు క్రిస్టియనాటినీ పెంపొందించాలంటే హిందూయిజాన్ని తగ్గించాలని కుట్ర పన్నారు. హిందూయిజం మంచిది కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. దాన్నే పెరియార్ అరువు తెచ్చుకున్నారు. అసమానతలపై పోరాటం వేరు. కానీ సనాతన ధర్మంపై ద్వేషంతోటే పోరాడాలన్నదే చర్చనీయాంశమైన పాయింట్.

తమిళనాడులో ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించే సభ’లో సీఎం స్టాలిన్ కొడుకు చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. హిందూయిజాన్ని తిట్టడమే అభ్యుదయవాదంగా వీళ్లు ప్రకటించారు.

తమిళనాటనే ద్రవిడవాదానికి నూకలు చెల్లే రోజు దగ్గరలో ఉందనడానికి ‘అన్నామలై’ పాదయాత్ర.. ఆయనకు వస్తున్న స్పందనే కారణం..

తమిళనాడు పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.