Jailer OTT: సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి సరైన హిట్ సినిమా లేక ఆయన ఫ్యాన్స్ బాగా నీరసించిన సమయంలో వచ్చింది జైలర్. ఆకలిగా ఉన్న పెద్ద పులి వేటాడితే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ దగ్గర రజినీకాంత్ ఆ స్థాయిలో చెలరేగిపోయాడు. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది ఈ సినిమా. దీనిని బట్టి చెప్పవచ్చు జైలర్ సత్తా ఏమిటో. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఆగస్టు 10 న విడుదలైన ఈ సినిమా ఇప్పటికి అక్కడక్కడా థియోటర్లో రన్ అవుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 7 న టెలికాస్ట్ అయ్యింది. అదే విధంగా సన్ నెక్స్ట్ లోనూ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక థియోటర్లో ఎలాంటి సందడి అయితే చేసిందో, OTT లో కూడా అదే స్థాయిలో దూసుకెళ్తుంది ఈ సినిమా. రిలీజ్ అయిన వెంటనే నెంబర్ స్థానంలో నిలిచింది జైలర్
దాదాపు ఏడేళ్ల నుంచి మంచి హిట్ కోసం రజినీకాంత్ కు జైలర్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇక తెలుగులో అయితే రోబో 2 తర్వాత సరైన హిట్ ఏది కూడా సూపర్ స్టార్ కి లేదు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో రజిని మార్కెట్ కూడా చాలా వరకు తగ్గింది. జైలర్ సినిమాకు తెలుగు రెండు రాష్ట్రాలకు కలిసి దాదాపు 12 కోట్లకు తీసుకున్నారు. నైజాం 4. 5 కోట్లు , సీడెడ్ 2. 5 కోట్లు , ఆంధ్ర 5. 5 కోట్లకు తీసేసుకున్నారు. కానీ ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది.
ఓవరాల్ గా తెలుగు 82 కోట్లు గ్రాస్, 45 కోట్ల దాకా నెట్ వసూళ్లు చేసింది. దీంతో సినిమాను తీసుకున్న బయ్యర్లు భారీ లాభాలు చూశారు. దాదాపు 30 కోట్లకు పైగా లాభాలు పొందారు. ఈ మధ్య కాలంలో ఇంతటి లాభాలు తెచ్చిన డబ్బింగ్ సినిమా మరొకటి లేదని చెప్పాలి. గతంలో వచ్చిన KGF 2, రోబో 2. O మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న కానీ ఈ స్థాయి లాభాలు రాలేదు. ఎందుకంటే వాటిని భారీ ధరకు అమ్మేశారు. కానీ జైలర్ కేవలం 13 కోట్లకు మాత్రమే అమ్మడంతో భారీ లాభాలు సొంతం చేసుకుంది. 124 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా 300 కోట్ల పైగా నెట్ సాధించి నిర్మాతకు ఊహించని లాభాలు తెచ్చింది.