Jai Bheem:ప్రముఖ స్టార్ హీరో సూర్య లాయర్‌గా నటించిన సినిమా జైభీమ్. టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. సూర్య, జ్యోతిక జంటగా ఈ సినిమాను నిర్మించారు. అయితే, ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన స్పందన లభిస్తోంది. ఓ వైపు చిత్రంపై ప్రశంసలు వెల్లువెత్తుతోంటే.. మరోవైపు, పెద్ద ఎత్తున విమర్శలు ఎగసిపడుతున్నాయి. అయితే, ఇందుకు కారణం సినిమా కథ కాదు.. అందులో ప్రకాశ్‌రాజ్ ఓ వ్యక్తి చెంపను పగలగొట్టడమే. ఈ సినిమాలో ఐజీ పాత్రలో నటించిన ప్రకాశ్‌రాజ్ ఓ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఓ వ్యక్తిని విచారిస్తారు. ఆ సమయంలో సదరు వ్యక్తి హిందీలో మాట్లాడతారు. అప్పుడు ప్రకాశ్‌రాజ్ అతని చెంప పగలగొట్టి, స్థానిక భాషలో మాట్లాడమంటారు. అయితే, హిందీలో మాత్రం ఈ సన్నివేశాన్ని ‘నిజం చెప్పు’ అనేలా డబ్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ సీన్ పై కాంట్రవర్సీ మొదలైంది. హిందీ భాషను తక్కువ చేశారంటూ కోపంతో విరుచుకుపడుతున్నారు.
దీనిపై స్పందించిన చిత్రబృందం తమకు అలాంటి ఉద్దేశం లేదని.. కేవలం కథ పరంగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాలో సూర్య గిరిజనుల హక్కుల కోసం పోరాడే న్యాయవాదిగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సూర్య లాయర్‌గా కనిపించిన తొలి సినిమా ఇదే. ఇందులో రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కన్పించారు. “జై భీమ్”కు సంగీతం సీన్ రోల్డాన్, సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ కధీర్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్ అందించారు.