Sai Pallavi: అలాంటి కథ దొరికితే చేయడానికి రెడీ : సాయి పల్లవి

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న హీరోయిన్​ సాయిపల్లవి. ఇటీవలే లవ్​స్టోరీ చిత్రంతోనూ కుర్రకారు మసను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు విరాటపర్వం చిత్రంలోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఇలా వరుస చిత్రాలతో టాప్​హీరోయిన్లలో ఒకరిగా స్థానం దక్కించుకుంది. అయితే, ఇటీవలే ఇన్​స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది ఈ భామ. ఈ క్రమంలోనే తనకు ఎప్పటినుంచో కామెడీ సినిమాలో నటించాలని కోరికగా ఉందని తన మనసులో మాట చెప్పింది. […]

Written By: Raghava Rao Gara, Updated On : November 3, 2021 2:40 pm
Follow us on

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న హీరోయిన్​ సాయిపల్లవి. ఇటీవలే లవ్​స్టోరీ చిత్రంతోనూ కుర్రకారు మసను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు విరాటపర్వం చిత్రంలోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఇలా వరుస చిత్రాలతో టాప్​హీరోయిన్లలో ఒకరిగా స్థానం దక్కించుకుంది. అయితే, ఇటీవలే ఇన్​స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది ఈ భామ. ఈ క్రమంలోనే తనకు ఎప్పటినుంచో కామెడీ సినిమాలో నటించాలని కోరికగా ఉందని తన మనసులో మాట చెప్పింది. మంచి కంటెంట్​ ఉన్న కథ దొరికితే కచ్చితంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీ సమయాల్లో ఏం చేస్తారని మరో నెటిజన్​ అడగగా.. బాగా తిని హాయిగా నిద్రపోతానని తెలిపింది.

మరోవైపుపు ఇటీవలే చూసిన సినిమాల్లో ​’డ్యూన్'(హాలీవుడ్​)​, ‘సర్దార్​ ఉద్ధమ్’​(హిందీ) నచ్చాయని చెప్పింది సాయిపల్లవి. అంతేకాక, ప్రకృతితో కలిసి జీవించడం తనకెంతో ఇష్టమని చెప్పింది. కాగా, రానా ప్రధానపాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విరాట పర్వం. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు నాని హీరోగా వస్తున్న శ్యామ్​ సింగ్​రాయ్​ సినిమాలోనూ హీరోయిన్​గా కనిపించనుంది.

సాయి పల్లవి సినిమాలో ఉందంటే ఆమె అందంతో పాటు నటన, డాన్స్​ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. వయ్యారాలు ఒలికే అందాలతో ఒంపులు తిరిగే శరీరాకృతితో కుర్రాళ్ల మతి పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. మరి వచ్చే సినిమాల్లో ప్రేక్షకులను ఎలాంటి పాత్రల్లో అలరించనుందో తెలియాలంటే కాస్త వేచి చూడక తప్పదు.