spot_img
Homeఎంటర్టైన్మెంట్Jai Bhim: మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసిన జైభీమ్​

Jai Bhim: మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసిన జైభీమ్​

Jai Bhim: తమిళ స్టార్​ హీరో సూర్య ప్రధాన పాత్రోల జ్ఞానవేల్​ దర్శకత్వం వహించిన సినిమా జై భీమ్​. ఈ సినిమా అక్టోబరు 2న అమెజాన్​ ప్రైమ్​లో విడుదలై.. మంచి టాక్​తో దూసుకెళ్లిపోతోంది. ఈ ఏడాది కూడా కరోనా ప్రభావంతో థియేటర్లకు కాస్త కష్టంగానే గడిచిందని చెప్పాలి. అయితే, ఈ ఏడాది ద్వితీయార్థంలో పెద్ద సినిమాలు విడుదలవ్వడం కాస్త ఊరట కలిగించింది. డిసెంబరులో అయితే, ఏకంగా సినిమా పండగే వచ్చంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, గతేడాది లాగే పలు చిత్రాలు ఓటీటీ వైపు అడుగులేశాయి. ఈ క్రమంలోనే గూగుల్​ ఈ ఏడాది ప్రేక్షకులు అత్యధికంగా సర్చ్ చేసిన జాబితాలో చోటు సంపాదించుకున్న సినిమాల జాబితాను విడుదల చేసింది.

Jai Bhim
Jai Bhim

ఆ లిస్ట్​లో సూర్య నటించిన జైభీమ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ సినిమా ఇప్పటికీ ఆ జోష్​తో కొనసాగుతోంది. 2020లో సూర్య హీరోగా వచ్చన ఆకాశం నీ హద్దురా సినిమా తొలిసారి గోల్డెన్​గ్లోబ్​ నామినేషన్స్​లో నిలిచింది. ఇప్పుడు జైభీమ్ గూగుల్ సర్చ్​ 2021లో టాప్​లో నిలిచి సూర్య ఖాతాలో మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

Also Read: సూర్య ‘జైభీమ్’ తెరవెనుక అసలు కథ.. 1993లో కర్ణాటకలో రియల్ రసకణ్ణును ఏం చేశారు..?

ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్​ మల్హోత్రా షేర్హా రెండో స్థానంలో, సల్మాన్ నటించిన రాధే మూడో స్థానంలో.. బెల్ బాటమ్, ఎటర్నల్స్, మాస్టర్, సూర్యవంశీ, గాడ్జిల్లా vs కాంగ్, దృశ్యం 2, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాలు ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాయి. దీంతో పాటు సెలబ్రిటీల గురించి కూడా ఎక్కువగా సర్చ్ చేసినట్లు ప్రకటించింది గూగుల్​. ఆర్యన్ ఖాన్, షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా, నటాషా దలాల్ టాప్​ 10లో నిలిచారు.

Also Read: పుష్ప సినిమా రన్​టైమ్​పై ఇంట్రెస్టింగ్ అప్​డేట్​

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version