Surya: ప్రముఖ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జైభీమ్. ఇటీవలే అమెజాన్ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరన పొందింది. అటు, సినీ ఇండస్ట్రీతో పాటు, పలువురు రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి కూడా ఈ సినిమా ప్రశంసలు పొందింది. కాగా, నిజ జీవిత సంఘటనల ఆధారంగా జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కించారు.
అయితే, అంతా బాగుందని అనుకుంటుండగానే.. కొన్ని ఊహించను చిక్కులు సూర్యతో పాటు, చిత్రయూనిట్‌కు ఎదురయ్యాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ కులాన్ని కించపరచి చూపించారంటూ.. సూర్యకు బెదిరింపులు, నోటీసులు వెళ్లాయి. అయితే, ఇటువంటి సినిమా తెరకెక్కించినప్పుడు ఇలాంటి బెదిరింపులు హీరోలకు కొత్తేం కాదు. ఒకరికి సమస్య ఎదురైనప్పుడు మిగిలిన హీరోలు ఏకమై అండగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
https://twitter.com/Actor_Siddharth/status/1460655224939433985?s=20
ఈ క్రమంలోనే సూర్యకు తోడుగా హీరో సిద్ధార్థ్, అసురణ్ దర్శకుడు వెట్రిమారన్‌లు ట్విట్టర్ వేదికగా తమ సపోర్ట్ తెలియజేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకు తాము అండగా ఉంటామని.. ఇటుంటి గొప్ప సినిమా తెరకెక్కించిన జ్ఞానవేల్‌కు, సూర్యకు ధన్యవాదాలు తెలుపుతూ.. పోస్ట్ చేశారు. గతంలో కమల్ హాసన్‌కు, విజయ్‌కు సపోర్ట్‌గా నిలిచాం.. ఇప్పుడు సూర్యకు కూడా అండగా ఉంటాం అంటూ తెలిపారు.
మరోవైపు ట్విట్టర్లో అభిమానులు ఐ స్టాండ్ విత్ సూర్య హ్యాష్ ట్యాగ్‌తో సూర్యకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అసలు ఈ సినిమా కథ నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కినప్పుడు.. ఎందుకు సూర్య క్షమాపణలు చెప్పాలి ? ఈ విషయంలో సూర్య వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు అధికార పార్టీ డీఎంకే కూడా సూర్యకే తమ సపోర్ట్ తెలియజేసింది.