Balakrishna: సినిమా హిట్ అయితే, ఆ హీరో చుట్టూ నిర్మాతల క్యూ ఉంటుంది. అచ్చం ‘బెల్లం ఉంటేనే ఈగలు ముసురుతాయి’ అనే సామెత లాగా అన్నమాట. అందుకే ఇమేజ్ అయినా, స్టార్ డమ్ అయినా పోతే రాదు, పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవాలి, లేదా సంపాదించాలి. మరి సంపాదించాలి అంటే.. గొప్ప హిట్ రావాలి, హిట్ రావాలి అంటే అన్ని కలిసి రావాలి. అన్నిటి కంటే ముఖ్యంగా కష్టం చేయాలి. ఎంతో కష్టపడాలి.
కనుక, కెరీర్ గురించి ప్రతి హీరో జాగ్రత్త పడతాడు. కానీ ఈ విషయంలో బాలయ్య బాబు శైలి వేరు. ఆయనకు కెరీర్ పై భయం లేదు, అలాగే జాగ్రత్త కూడా లేదు. ఒక హిట్ వస్తే రెండు హిట్లు తీసిన డైరెక్టర్ ను పెట్టుకోవాలి. డబ్బు విషయంలో ఒక సూత్రం ఉంది. పది పైసలు ఉంటే, ఉన్నది ఐదు పైసలే అని చెప్పాలట. మిగతాది భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాలి అట.
అచ్చం ఇదే సూత్రాన్ని సినిమాకి కూడా అప్లై చేసుకోవాలి. సక్సెస్ తాలూకు డిమాండ్ ను దాచుకోవాలి. అవసరం అయితే, దాన్ని పెంచుకుంటూ పోవాలి. అంతేగానీ, ఒక్క హిట్ వచ్చింది కదా అని, ముందుచూపు లేకుండా ఎమోషన్స్ తో ముందుకు పోతే.. మిగిలేవి చివరకు మళ్ళీ ప్లాప్ లే. కథ చెప్పిన ప్రతి ఒక్కడికి భోళాగా మొత్తం డేట్లు ఇవ్వకూడదు. గతంలో బాలయ్య బాబు ఇదే తప్పు చేశాడు.
తనకు నచ్చిన కథ ఎవరైనా వచ్చి చెబితే వాళ్లకు డేట్లు ఇచ్చేసేవాడు. ఇక ఆ తర్వాత అంతే సంగతి. స్టార్ డమ్ ఉన్నా.. ఓపెనింగ్స్ వచ్చేవి కావు. ఈ విషయాన్ని మనం బాలయ్య గత సినిమాల నుంచి అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఇప్పటికైనా ఎవరికీ డేట్లు ఇవ్వాలి ? ఎంత మేరకు సినిమాని ప్లాన్ చేయాలి ? అనిస్వానుభవాలతో బాలయ్య ఇక నుంచైనా నేర్చుకోవాలి.
Also Read: RRR Trailer : ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలొచ్చాయ్..’ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బీభత్సం
సక్సెస్ ఎపుడూ ముందుచూపు, జాగ్రత్త పడకపోతే ఉండదు. ముందు సినిమాల ఫలితాలను గుర్తు తెచ్చుకుని ముందుచూపుతో దర్శకులను ఎంచుకుంటే.. బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు ఒకరి నుండి ఇంకొకరికి రకరకాల కథల రూపాల్లో చేతులు మారుతూ ఉంటుంది. ఆ మార్పు త్వరగా లేకుండా బాలయ్య ప్లాన్ చేసుకోవాలి.