https://oktelugu.com/

RRR Movie Trailer: ఫస్ట్ఆఫ్​​ మొత్తం తారక్​.. సెకండ్ ఆఫ్​లో రామ్​ బీభత్సం.. ట్రైలర్​లో రాజమౌళి చెప్పింది ఇదేనా?

RRR Movie Trailer: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను థియేటర్​లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు ఆర్​ఆర్​ఆర్​ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 1:12 pm
    Follow us on

    RRR Movie Trailer

    RRR Movie Trailer

    RRR Movie Trailer: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను థియేటర్​లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు ఆర్​ఆర్​ఆర్​ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. కాగా, థియేటర్​లో విడుదలైన కాసేపటికే చిత్రబృందం ఈ ట్రైలర్​ను యూట్యూబ్​లో విడుదల చేసింది. ట్రైలర్​ను బాగా గమనిస్తే.. చాలా ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

    RRR Trailer (Telugu) - NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli | Jan 7th 2022

    Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఇవే హైలైట్స్.. ఇవి 5 గమనించారా?

    కథ, సీన్స్​, ఎమోషన్స్​ అన్నీ బాలెన్స్​గా రాజమౌళి తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ట్రైలర్​ ప్రకారం.. భీమ్​ గూడెం ప్రజలను కాపుకాగే వ్యక్తిగా ఉండగా.. రామ్​చరణ్ బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పోలీసు అధికారిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్యలో మంచి స్నేహం ఉన్నప్పటికీ.. వృత్తిపరంగా వీరిద్దరి మధ్యలో పలు విభేదాలు తలెత్తనుండగా.. ఆ తర్వాత రామ్​​ రియలైజ్​ అయ్యి.. దేశం కోసం భీమ్​తో కలిసిపోయి పోరాడనున్నట్లు ట్రైలర్​ చూస్తే అర్థమవుతుంది. దీంతో పాటు ఫస్ట్ ఆఫ్ మొత్తం తారక్​ను హైలైట్​ చేసి చూపించగా.. సెకండ్ ఆఫ్​లో రామ్​చరణ్​ను భీభత్సమైన లుక్​లో చూపించనున్నట్లు ట్రైలర్​ని బట్టి తెలుస్తోంది. ఇందులో రామ్​చరణ్​ విభిన్న పాత్రలు పోషించారు. అందులో అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఒకటి. ట్రైలర్​లో రామ్​చరణ్ అల్లూరి సీతారమరాజు పాత్రలో ఇరగదీశారు. చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

    ఈ సినిమాలో అజయ్​ దేవగణ్​ పాత్ర కూడా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్రను చూస్తుంటే భగత్​సింగ్​ ఇన్​స్పిరేషన్​తో తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉండనుందో తెలియాలంటే.. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు.

    Also Read: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్.. కుంభస్థలం బద్దలు కొట్టడం గ్యారంటీ