https://oktelugu.com/

Jagapathi Babu: తప్ప తాగి బట్టలు విప్పేసిన జగపతిబాబు… ప్రైవేట్ ఫోటో వైరల్!

తాజాగా ఒక ఫోటో షేర్ చేసిన జగ్గూభాయ్ " ఫ్రెండ్స్ తో తాగి బట్టలు ఊడతీసి తందనాలు ఆడటం అంటే ఇదే " అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో జగపతిబాబు మరియు అతని ఫ్రెండ్స్ ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Written By: , Updated On : September 5, 2023 / 06:04 PM IST
Jagapathi Babu

Jagapathi Babu

Follow us on

Jagapathi Babu: తాగి తందనాలు ఆడటానికి సిగ్గు లేదా అనే మాటలు మనం తరుచు వింటూనే ఉంటాం. నిజానికి తందనాలు అంటే ఏమిటో మనలో చాలా మందికి తెలియదు. దానికి అసలైన అర్ధం ఇదే అంటూ చెప్పుకొచ్చాడు మన జగ్గు బాయ్ అదేనండి మన వెటరన్ హీరో జగపతిబాబు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేసిన ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది.

ఒకప్పుడు అమ్మాయిల రాకుమారుడు, అసలు పెళ్లి అంటూ చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలని అమ్మాయిలందరూ అనుకునే రేంజ్ తెలుగు ప్రేక్షకులను అలరించిన జగపతిబాబు, ఆ తర్వాత కొంచెం వెనకబడి సినిమాలకు దూరంగా ఉన్న కానీ, వెంటనే బ్యాక్ బౌన్స్ అవుతూ విలన్ గా లెజెండ్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. టాలీవుడ్ , కోలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు జగ్గు బాయ్.

తాజాగా ఒక ఫోటో షేర్ చేసిన జగ్గూభాయ్ ” ఫ్రెండ్స్ తో తాగి బట్టలు ఊడతీసి తందనాలు ఆడటం అంటే ఇదే ” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో జగపతిబాబు మరియు అతని ఫ్రెండ్స్ ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఒంటి మీద షర్ట్ ఏమి లేకుండా ప్యాంట్ తో డాన్స్ చేస్తున్న ఫోటో అది. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని తెలుస్తుంది. దాదాపు పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం ఫోటో అని తెలుస్తుంది.

ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు జగ్గూభాయ్. మొదటి నుండి గోల్డెన్ స్పూన్ గా పెరిగిన జగపతిబాబు ఒకానొక సమయంలో ఉన్న ఆస్తులు కరిగిపోవటం, సినిమా అవకాశాలు సరిగ్గా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న జగపతిబాబు ఎప్పుడైతే విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడో తాను పోగొట్టుకున్న వాటి కంటే కూడా ఎక్కువగా సంపాదించారని తెలుస్తుంది.

https://twitter.com/IamJagguBhai/status/1698932893643579700