https://oktelugu.com/

Manchu Vishnu: ఆ పనిచేసినందుకు జగన్, షర్మిల తిట్టారు: హీరో విష్ణు

కలెక్షన్ కింగ్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు హిట్స్.. ఆరు ఫ్లాపులతో ఆయన సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ సరైన బ్రేక్ తెచ్చుకోవడం లేదు. ఇప్పటికీ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ పోతున్నాడు. ఈ మధ్య తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లోనూ పోటీకి దిగి మాటల మంటలు రేపుతున్నారు. తాజాగా ‘అలీ సరదాగా’ షోలో ఆసక్తికర విషయాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2021 / 11:47 AM IST
    Follow us on

    కలెక్షన్ కింగ్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు హిట్స్.. ఆరు ఫ్లాపులతో ఆయన సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ సరైన బ్రేక్ తెచ్చుకోవడం లేదు. ఇప్పటికీ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ పోతున్నాడు. ఈ మధ్య తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లోనూ పోటీకి దిగి మాటల మంటలు రేపుతున్నారు. తాజాగా ‘అలీ సరదాగా’ షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

    ఏపీ సీఎం జగన్, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల తనను తిట్టారని మంచు విష్ణు గుర్తు చేసుకున్నాడు. దానికి గల కారణాలను వివరించారు. ‘నాకు పిల్లలంటే ఇష్టం అని.. 10,15 మందిని కనాలని ఉండేదన్నారు. అంతమంది ఉన్నా తనకు ఓకే అన్నారు. షూటింగ్ సమయంలోనూ పిల్లలు ఎక్కడుంటే అక్కడి వెళ్లి ఎంజాయ్ చేస్తానన్నారు.

    ఇక నా పిల్లల విషయంలో మేం ఏదీ ప్లాన్ చేసుకోలేదని..నాకు కూతురు కావాలని ఉండేదని.. కానీ ట్విన్స్ పుట్టడంతో నలుగురు పిల్లలు అయ్యారని మంచు విష్ణు తెలిపాడు. అప్పటికే ఒకసారి కవలలు, మరోసారి అబ్బాయి పుట్టాడు. అయితే ఆ తర్వాత సడెన్ మళ్లీ తన భార్య విన్నీ ప్రెగ్నెంట్ అయ్యిందని మంచు విష్ణు తెలిపాడు.

    అప్పటికే మాకు ముగ్గురు పిల్లలు అని.. మళ్లీ ప్రెగ్నెంట్ అనగానే అందరూ తిట్టడం మొదలుపెట్టారని మంచు విష్ణు తెలిపారు. మొదట తన భార్యకు వరుసకు అక్క అయిన వైఎస్ షర్మిల కనిపించగానే ‘మా విన్నీని ఇబ్బంది పెట్టడం ఆపేయ్’ అని కోప్పడి వెళ్లిపోయారని విష్ణు గుర్తు చేసుకున్నాడు. ఆ వెంటనే జగన్ గారు వచ్చి ‘విష్ణు మా చెల్లిని ఎందుకంతగా ఇబ్బంది పెడుతున్నావ్.. నలుగురు పిల్లలు చాలు’ అంటూ కోప్పడ్డారని విష్ణు పాత జ్ఞపకాలు నెమరువేసుకున్నాడు. అదొక ఫన్నీ సంఘటన అని చెప్పుకొచ్చారు. షర్మిల, జగన్ తనకు అభినందనలు చెబుతూనే తిట్టడం మొదలుపెట్టారని గుర్తు చేసుకున్నాడు.