తనలో ఇంకా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అని చాటి చెప్పడానికి పరిధి దాటిన పాత్రల్లో కూడా జీవించింది. పైగా ఆ మధ్య వరుస హాట్ ఫోటో షూట్ లు కూడా చేసింది. అవకాశం వస్తే, ఇప్పుడు కూడా హీరోయిన్ గా చేయడానికి తాను రెడీ అంటూ హిందీ మేకర్స్ కు టబు కబురు పంపుతుందట. కాకపోతే.. ఈ వయసులో టబును హీరోయిన్ గా పెట్టుకుని ఎవరు మాత్రం సినిమా చేస్తారు.
కానీ, ఓటీటీ పుణ్యమా అని టబు లాంటి సీనియర్ భామలకు ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చింది. తాజాగా టబు ఓ హిందీ వెబ్ సిరీస్ అంగీకరించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తోన్న ఈ సిరీస్ లో టబుదే కీలక పాత్ర. పైగా ఈ సిరీస్ లో ఆమె చాలా కొత్తగా కనిపించబోతుంది.
తనకంటే వయసులో చిన్నవాడు అయిన హీరోతో ప్రేమలో పడి, అతని కోసం ఓ మర్డర్ కూడా చేసే నెగిటివ్ పాత్రలో టబు కనిపించబోతుంది. పైగా ఈ సిరీస్ లో టబు ఫుల్ గ్లామర్ గా కనిపించబోతుంది. మరి ఒకప్పటి టబును అలాగే ఒకప్పటి ఆమెలోని నటనా ఉత్సాహాన్ని ఈ సిరీస్ లో చూస్తామా..!
టబు మాత్రం కాస్త హద్దు మీరు మరీ ఈ సిరీస్ లో నటిస్తోంది. మెయిన్ గా యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తోన్న ఈ సిరీస్ లో మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడు. అన్నట్టు టబు ప్రస్తుతం ఆంటీ, తల్లి పాత్రలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘అల వైకుంఠపురంలో’ బన్నీకి తల్లిగా ఆమె నటించింది.