Jack Movie : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోలలో ఒకరు సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఆయన గత చిత్రం ‘టిల్లు స్క్వేర్’ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచావ్యాప్తంగా ఈ చిత్రానికి దాదాపుగా 135 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక మీడియం రేంజ్ హీరో కి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇక సిద్దు కూడా నాని(Natural Star Nani), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) క్యాటగిరీలోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రతీ సినిమాకు మినిమం రేంజ్ లో అయినా ఓపెనింగ్స్ ఉంటాయని అనుకున్నారు. కానీ రేపు విడుదల కాబోతున్న’జాక్'(Jack Movie) మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.. బుక్ మై షో యాప్ లో గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకు కేవలం 8 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.
Also Read : కోర్ట్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..ఆ ఒక్క ప్రాంతంలో నష్టాలు తప్పలేదు!
ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 34 వేల డాలర్లు ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. టిల్లు స్క్వేర్ చిత్రానికి కేవలం నార్త్ అమెరికా నుండే మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టి ఆ చిత్రానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ట్రైలర్ తో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, ఆ దిశగా ఆయన డైలాగ్స్ కూడా పెట్టాడు. ట్రైలర్ ని చూసిన బజ్ పెరిగింది అంటూ సోషల్ మీడియా లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్రైలర్ లో వచ్చే చివరి డైలాగ్ బాగా పేలిందని సిద్దు చెప్పుకొచ్చాడు, రేపు థియేటర్స్ లో ఈ డైలాగ్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది చూడాలి.
Also Read : మోహన్ బాబు ఇంటి గేట్ ముందు ధర్నా కి దిగిన మంచు మనోజ్..వీడియో వైరల్!