Mohan Babu : గత ఏడాది డిసెంబర్ నెల నుండి, ఇప్పటి వరకు మంచు కుటుంబం లో వివాదాలు ఏ రేంజ్ లో కొనసాగుతున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. గుట్టుగా ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన ఈ సమస్య రోడ్డు మీదకు వచ్చింది. మనోజ్(Manchu Manoj) నా ఆస్తులను అనుభవించడానికి వీలు లేదు, అతని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే ఆంటూ LB కోర్టు లో ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన కోర్టు మోహన్ బాబు(Manchu Mohan Babu) కు అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. అంతే కాకుండా మంచు మనోజ్ ని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కోర్ట్ కూడా తీర్పుని ఇచ్చింది. అయితే మనోజ్ తరుపున న్యాయవాది మోహన్ బాబు కు వ్యతిరేకంగా కొన్ని ఆధారాలను కోర్ట్ కి సబ్మిట్ చేశాడు. మోహన్ బాబు తరుపున న్యాయవాదులు కోర్టుని తప్పుదోవ పట్టించారని ఆధారాలతో సహా చూపించడం తో అంతకు ముందు మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుని కోర్ట్ నేడు కొట్టిపారేసింది.
Also Read : మోహన్ బాబు ఇంటి గేట్ ముందు ధర్నా కి దిగిన మంచు మనోజ్..వీడియో వైరల్!
దీంతో ఈ కేసు విషయం లో మనోజ్ దే విజయం. సోషల్ మీడియా లో మంచు కుటుంబం పట్ల ఎంత నెగటివిటీ ఉన్నప్పటికీ, మనోజ్ అంటే అందరికీ ఇష్టమే. ఆయన మాట తీరు, సమాజం మీద చూపించే ప్రేమ వంటివి అందరికీ ఇష్టం. ముఖ్యంగా అప్పుడప్పుడు ఆయన సమాజం లో జరిగే బర్నింగ్ టాపిక్స్ గురించి మాట్లాడిన మాటలను ఆడియన్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఈ అంశం లో నెటిజెన్స్ అందరూ మనోజ్ కి సపోర్ట్ గా నిలిచారు. కోర్టు నుండి అనుమతి ఉన్నప్పటికి మనోజ్ ని జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి లోపలకు వెళ్తున్నప్పుడ్డు సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో నేడు ఆయన గేట్ బయటే బైఠాయించి ధర్నాకు దిగిన సంగతి అందరికీ తెల్సిందే. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
విష్ణు కి చిన్నప్పటి నుండి తాను అంటే కుళ్ళు అని, మా నాన్న వద్దకు వెళ్లి మనోజ్ జుట్టు తన చేతుల్లో ఉండేలా మాట తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ మా నాన్న కూడా ఎప్పుడు అతని వైపే ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్తులు కోసం నేను ఏ రోజు కూడా పోరాడలేదని, కేవలం క్యాంపస్ లో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించినందుకు ఇంత పెద్ద గొడవ జరిగిందని అంటున్నందు మనోజ్. నా భైరవం చిత్రాన్ని కన్నప్ప కి పోటీ గా విడుదల చేస్తానని చెప్పడం భయపడిన విష్ణు తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, ఆ కక్ష్య ని ఈ రూపం లో తీర్చుకుంటున్నాడంటూ ఆరోపించాడు మనోజ్.