Court Movie : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ఒక సక్సెస్ ఫుల్ హీరో మాత్రమే కాదు, అంతకు మించి సక్సెస్ ఫుల్ నిర్మాత కూడా. ఇప్పటి వరకు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. రీసెంట్ గా విడుదలైన కోర్ట్(Court – State Vs A Nobody) చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని థియేటర్స్ లో కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ గ్యాప్ లో ఎన్నో కొత్త సినిమాలు వచ్చాయి, సూపర్ హిట్ అయ్యాయి కూడా, కానీ కోర్ట్ చిత్రం మాత్రం ఇప్పటికీ డీసెంట్ స్థాయిలోనే థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. అయితే నిన్నటితో ఈ చిత్రానికి షేర్ వసూళ్లు రావడం దాదాపుగా అన్ని ప్రాంతాల నుండి ఆగిపోయింది.
Also Read : మార్క్ శంకర్ సేఫ్..సోషల్ మీడియా ని ఊపేస్తున్న లేటెస్ట్ ఫోటో!
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ప్రాంతాల వారీగా ఇప్పుడు మనం చూడబోతున్నాము. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ఎవ్వరూ ఊహించని విధంగా 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఊరు పేరు తెలియని చిన్న హీరో సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం, అది కూడా నైజాంలో అనేది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా ఈ చిత్రానికి సీడెడ్ ప్రాంతంలో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సీడెడ్ లోని కొన్ని మాస్ సెంటర్స్ లో ఈ చిత్రానికి నష్టాలు వాటిల్లాయి కానీ, ఆంధ్ర లో మాత్రం 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్తనాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి రెండు కోట్ల 43 లక్షలు, ఓవర్సీస్ లో 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 58 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం రెండు మూడు కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మన్చిన ఈ చిత్రం, ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది నిజంగా అందరికీ పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా రాబోతుంది.
Also Read : అందుకే నేను రెండవ పెళ్లి చేసుకోలేదు – రేణు దేశాయ్