Hyper Aadi latest video: జబర్దస్త్ ఫేమ్ శాంతి స్వరూప్-హైపర్ ఆది ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్విమ్మింగ్ ఫూల్ లో వీరు జలకాలు ఆడుతూ ఆహ్లాదంగా గడిపారు. సదరు వీడియో మీద మీరు కూడా ఓ లుక్ వేయండి..
జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది(Hyper Aadi) అంటే బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది సంచనాలు చేశాడు. నాన్ స్టాప్ పంచులతో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసేవాడు. హైపర్ ఆది – రైజింగ్ రాజు టీం అంటే ఒక బ్రాండ్ నేమ్. ఎక్స్ట్రా జబర్దస్త్ కి హైపర్ ఆది టీమ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. హైపర్ ఆది టీం లో రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ ఉండేవారు. వీరి మీద హైపర్ ఆది వేసే పంచ్ లు ఓ రేంజ్ లో పేలేవి. ముఖ్యంగా రైజింగ్ రాజు వయసు, శాంతి స్వరూప్ ఫిజిక్ ఆధారంగా హైపర్ ఆది కామెడీ పంచులు రాసుకునేవాడు.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా… విజయ్ నామ సంవత్సరం స్టార్ట్ అవ్వనుందా..?
హైపర్ ఆది జబర్దస్త్ మానేశాక ఆ షోకి ఆకర్షణ తగ్గింది. రోజా, అనసూయ, నాగబాబు, సుడిగాలి సుధీర్ తో పాటు హైపర్ ఆది సైతం జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాడు. అయినప్పటికీ ఢీ డాన్స్ రియాలిటీ షోతో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది సందడి చేస్తున్నాడు. రైజింగ్ రాజు సైతం జబర్దస్త్ కి దూరమయ్యాడు. శాంతి స్వరూప్ మాత్రమే కొనసాగుతున్నాడు. లేడీ గెటప్స్ తో శాంతి స్వరూప్ తనదైన కామెడీ పంచుతాడు. అతడి ఆహార్యమే నవ్వు తెప్పించేలా ఉంటుంది. హైపర్ ఆది టీం లేని నేపథ్యంలో ఇతర టీమ్స్ లో శాంతి స్వరూప్ కామెడీ పాత్రలు చేస్తున్నాడు.
కాగా హైపర్ ఆది, శాంతి స్వరూప్(Shanti Swaroop) లకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతున్నారు. వీరితో మరికొంత మంది బుల్లితెర కమెడియన్స్ జాయిన్ అయ్యారు. అందరూ కలిసి శాంతి స్వరూప్ ని ఆట పట్టించడం ఆ వీడియోలో మనం చూడొచ్చు. అందరూ ఒకేరకమైన యూనిఫామ్ ధరించి ఉన్నారు. ఏదో ఈవెంట్ కి వెళ్లిన బుల్లితెర కమెడియన్స్ ఇలా ఎంజాయ్ చేశారనిపిస్తుంది.
Also Read: కొడుకులకు కి సక్సెసులు అందించలేకపోయిన మన స్టార్ హీరోలు…
మరోవైపు వెండితెర కమెడియన్ గా హైపర్ ఆది బిజీ అవుతున్నారు. ఆయన పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే సిల్వర్ స్క్రీన్ మీద హైపర్ ఆదికి ఇంకా బ్రేక్ రాలేదనే చెప్పాలి. బుల్లితెర షోలలో పండిన స్థాయిలో వెండితెర మీద ఆయన కామెడీ పేలడం లేదు. అందుకే హైపర్ ఆది అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. రచయితగా కూడా హైపర్ ఆది పని చేస్తున్నాడని సమాచారం.
View this post on Instagram