Sudigali Sudheer- Hyper Aadi: జబర్దస్త్ షో ఒక సంచలన. ఈ షో గొప్ప విజయం సాధించింది. ఎందరో జీవితాలను గాడిన పెట్టింది. ఎందరో చిన్న కమెడియన్లను ఆర్థిక బాధల నుంచి బయటపడేసింది. దినదినాభివృద్ధి చెందిన జబర్దస్త్ దాదాపు పదేళ్లుగా తిరుగులేని టీఆర్పీ తో ముందుకు సాగుతుంది. అయితే, ఈ మధ్య జబర్దస్త్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా హైపర్ ఆది కూడా ఈ షో గురించి చాలా విషయాలను ఓపెన్ గా చెప్పారు. ముఖ్యంగా కొన్ని రోజులుగా జబర్దస్త్ కి సంబంధించిన ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి.
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కిరాక్ ఆర్పీ లాంటి వ్యక్తులు ఈ షో పై చాలా విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా ఫేమస్ కమెడియన్ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వీడటంపై కూడా ఆర్పీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సుధీర్ కి అవమానం జరిగింది, అందుకే అతను షో నుంచి బయటకు వచ్చేశాడు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి సుధీర్ బయటకు రావడం ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి.
Also Read: Sreeleela: ఐటమ్ సాంగ్స్ కి క్రేజీ బ్యూటీ సై.. ఆ స్టార్ హీరో సినిమాలో ఫిక్స్
జబర్దస్త్ కోసం సుడిగాలి సుధీర్ నిజంగానే తన పై రొమాంటిక్ బాయ్ అనే ఇమేజ్ ను కావాలని సృష్టించుకున్నాడా ?, రష్మీతో తన రొమాంటిక్ యాంగిల్ ను కావాలని తన పై రుద్దుకున్నాడా ?, ఈ విషయాల పై సుధీర్ ఫీల్ అయ్యాడా ?, అందుకే జబర్దస్త్ ను వీడాడా ? అని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు కిర్రాక్ ఆర్పీ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేశాడు.
దాంతో సుడిగాలి సుధీర్‌కి కూడా జబర్దస్త్‌లో ఘోర అవమానాలు జరిగాయని ఓ వార్త బాగా ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్ కి హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మల్లెమాల విషయమై కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్‌లో ఎలాంటి నిజాలు లేదని తేల్చి చెప్పారు.
అలాగే సుధీర్ విషయం పై కూడా స్పందిస్తూ.. సుడిగాలి సుధీర్‌కి జబర్దస్త్‌లో ఎలాంటి అవమానాలు జరగలేదు అని క్లారిటీ ఇచ్చారు. మల్లెమాలతో సుధీర్ కాంట్రాక్టు ఫినిష్ అయ్యింది అని, పైగా సుధీర్ ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు అని, అందుకే జబర్దస్త్ ను వీడాడు అని స్పష్టం చేశారు.
Also Read:Revanth Reddy- KTR: టార్గెట్ కేటీఆర్.. రాహుల్ తో రేవంత్.. సిరిసిల్లలో మోహరింపు