CM Jagan- CNOS Survey: దేశంలోనే తమ అధినేత మహా శక్తివంతమైన నేత. జనాదరణ గలిగిన నాయకుడు. జగన్ గురించి వైసీపీ శ్రేణులు తరచూ అన్న మాటలివి. దానికి కారణం లేకపోలేదు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాల్లో విజయం కట్టబెడితే దీమా అలానే ఉంటుంది. నాడు వార్ వన్ సైడ్ అవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో నరనరాన ఇదే ఫిక్స్ అయిపోయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల మావే అంటూ తెగ హల్ చల్ చేస్తున్నారు. చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం ఓడిస్తామని తెగ బీరాలు పలుకుతున్నారు. వాస్తవ పరిస్థితి అంచనా వేయకుండా ఊహాగానాల్లో తేలుతున్నారు. అటువంటి వారికి మింగుడు పడని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. దేశంలో జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్ అట్టడుగునకు చేరిపోయారు. 25 రాష్ట్రాలకుగాను చివరి నుంచి ఆరో స్థానానికి చేరుకున్నారు. 20వ స్థానంతో సరిపెట్టకున్నారు.

వైసీపీ శ్రేణుల్లో ఆందోళన
సెంటర్ ఆఫ్ నేషనల్ ఓపీనియన్ సర్వే (సీఎన్వోఎస్) తాజాగా విడుదల చేసిన సర్వేలో జగన్ బాగా వెనుకబడ్డారు. పూర్తి ప్రామాణికతతో చేసిన సర్వే కావడంతో వైసీపీ శ్రేణుల నుంచి నోటి మాట రావడం లేదు. ఎంతో అనుకుంటే.. ఇదేంది ఇలా అయ్యిందంటూ వారు నిట్టూర్చుతున్నారు. వైసీపీ ప్లీనరీ సక్సెస్ రోజుల తరబడి నిలవకముందే దుర్వార్త వచ్చిందని తెగ బాధపడిపోతున్నారు. తమ నాయకుడు మాట తప్పడు.. మడమ తిప్పడు, దేశంలోనే ప్రధాని మోదీ తరువాత జనాదరణ ఉన్న నేతగా వైసీపీ శ్రేణులు భుజాలుకెత్తుకునేవి. సోషల్ మీడియాలో సైతం ఊదరగొడుతుండేవి. కానీ తాజా సర్వేలో జగన్ స్థానం తెలిశాక అసలు దీనిపై స్పందించాలా? వద్దా? అంటూ వైసీపీ శ్రేణులు డిఫెన్స్ లో పడిపోయాయి. పోనీ ఈ సర్వేను వ్యతిరేకిస్తామంటే.. గతంలో మంచి స్థానం వచ్చినప్పుడు తెగ ట్రోలింగ్ చేశారు. అదే సైలెంట్ గా ఉండిపోతే తమ పని అయిపోయినట్టుందని ఒప్పుకున్నట్టవుతుందని ఆందోళన చెందుతున్నారు.
Also Read: Tea Production: సామాన్యులకు మరో ఉపద్రవం.. అష్టకష్టాలే..
ప్రమాణిక సర్వే..
సెంటర్ ఆఫ్ నేషనల్ ఓపీనియన్ సర్వే (సీఎన్వోఎస్)కు మంచి ప్రమాణికత ఉంది. ఎప్పటికప్పడు ఈ సర్వే బృందం ప్రజల్లోకి వెళ్లి అభిప్రాయాలను సేకరిస్తోంది. వాటిని క్రోడీకరించి సర్వేను వెల్లడిస్తుంది. తాజాగా ప్రధాని మోదీతో పాటు దేశ వ్యాప్తంగా 25 మంది సీఎంల పనితీరు, వారికున్న జనాదరణపై సర్వే చేసింది. ఏపీ సీఎం జగన్ కు దేశంలో 20వ స్థానం లభించింది. రాష్ట్రంలోని 39 శాతం మంది ఆయన నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 29 మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 32 శాతం మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు. ఈ సర్వేలో మరో తెలుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన 11వ స్థానంలో ఉన్నారు. ఏపీ సీఎం జగన్ తో పోల్చుకుంటే 9 శాతం ఆదరణతో ముందంజలో ఉన్నారు. ఆయన నాయకత్వంపై 49 మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 19 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. మిగతా32 మంది మాత్రం తటస్థంగా ఉండిపోయారు.

నవీన్ నంబర్ వన్..
ప్రజాదరణ ఉన్న సీఎంల్లో పక్కనే ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఆ రాష్ట్ర మెజార్టీ ప్రజలు నవీన్ పాలనపై సంతృప్తితో ఉన్నారు. ఏకపక్షంగా 70 శాతం మంది ప్రజలు ఆయన వైపే మొగ్గుచూపారు. ఈ తరువాత స్థానాల్లో యోగి ఆదిత్యనాథ్ (యూపీ), మొన్నటివరకూ మహారాష్ట్ర సీఎంగా ఉన్న ఉద్దవ్ ఠాక్రే, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఉన్నారు. అటు ప్రధాని మోదీకి సైతం జనాదరణ పెరిగింది. దేశంలో 54 శాతం మంది ఆయన పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే తాజాగా వెలువడిన సర్వేలో జగన్ వెనుకబడి పోవడం మాత్రం వైసీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.
Also Read:Modi- Jagan: జగన్ ను మరింత అప్పులపాలుచేస్తున్న మోదీ