Anand Mahindra: ఆదివారం వస్తే చాలు కొంతమంది ప్రత్యేకమైన వంటకాలు వండుకొని ఆరగిస్తారు. మరి కొంతమంది ఎటైనా టూర్ ప్లాన్ చేస్తారు. ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తారు. అలాంటి వారిలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీ మహీంద్రా గ్రూపు సంస్థల అధిపతి ఆనంద్ మహీంద్రా ముందు వరుసలో ఉంటారు. ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రత్యేకమైన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తారు. దానికి సంబంధించి తనదైన హాస్య చతురత లేదా సమాచారాన్ని జోడిస్తారు. ఇక ఈ ఆదివారం తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఐకాన్ ఆఫ్ ది సీస్ అనే క్రూయిజ్ షిప్ గురించి ప్రస్తావించారు. ఆ వీడియోను అందులో పోస్ట్ చేశారు. ఇంతకీ దాని విశేషాలు ఏంటంటే.
ఐకాన్ ఆఫ్ ది సీస్ అనే పేరుతో క్రూయిజ్ షిప్ ను రాయల్ కరేబియన్ గ్రూప్ తయారు చేసింది. ఈ షిప్ తయారీ కోసం దాదాపు రెండు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది.. ఇది టైటానిక్ షిప్ కంటే ఐదు రెట్లు పెద్దది. 20 అడుగుల పొడవు, 1,200 వందల అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో 7,600 ప్రయాణికులు ప్రయాణం సాగించవచ్చు. 2,805 గదులు ఉన్నాయి. ఈ గదులలో 10,000 మంది దాకా నివాసం ఉండొచ్చు. ఈ ఓడలో ఆరు వాటర్ పార్కులు ఉన్నాయి. 7 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. హాయిగా సినిమాలు చూసుకునేందుకు పదులకొద్దీ మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి.. ఒక కాసినో కూడా ఉంది. 40 కి పైగా డైనింగ్, డ్రింకింగ్ స్పాట్లు ఉన్నాయి. ఇంత పెద్ద క్రూయిజ్ షిప్ సహజ వాయువుతో నడుస్తుంది. ఎకో ఫ్రెండ్లీ విధానంలో దీనిని రూపొందించారు.. సముద్రంలో నీటిని శుద్ధి చేసి.. ఈ ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల నీటి అవసరాలు తీర్చుతుంది. ఈ షిప్ లో 2026 వరకు టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది ప్రపంచం మొత్తం చుట్టి వస్తుంది. విహరించాలనుకున్న ప్రాంతాన్ని బట్టి ఈ ఓడలో చార్జ్ చేస్తారు. 3,500 నుంచి పదివేల డాలర్ల వరకు ఇందులో ప్యాకేజీలు ఉన్నాయి. పెద్దలకు మాత్రమే కాదు.. చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆమ్యూజ్మెంట్ పార్కులు కూడా ఉన్నాయి. షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్ క్లబ్స్ వంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల ఆహార శైలికి అనుగుణంగా ఇక్కడ వంటలు తయారు చేస్తారు. ఒక రకంగా ఇది నీటిపై తెలియాడే ఒయాసిస్ లాంటిది.
ఈ షిప్ ప్రాధాన్యం తెలిసే ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. “ఆదివారం విశ్రాంతి కోసం.. ఆ విశ్రాంతిని వీక్షించే వారికోసం.. పర్యాటక జనాభాలో భారతీయులు ప్రపంచంలోనే రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. వారి కోసమే మా సొంత సొంత క్రూయిజ్ షిప్ లను ఎక్కువగా డిమాండ్ చేస్తాం. రూపొందిస్తామని” ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఐకాన్ ఆఫ్ ది సీస్ లో బుకింగ్స్ 2026 వరకు పూర్తయ్యాయని.. ఇప్పట్లో అందులో ప్రయాణించే అవకాశం లేదని వివరించారు. కాగా, ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. సొంత క్రూయిజ్ లలో మాత్రమే వెళ్తామని ఆనంద్ చెప్పడంతో క్లబ్ మహీంద్రా ద్వారా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. దీనికి ఏమో, కావచ్చేమో అన్నట్టుగా ఆనంద్ బదులిచ్చారు.
For Sunday leisure viewing.
It’s booked till ‘26.
But Indians will be one of the two largest tourist populations in the world…
And we will most likely demand—and get—our own cruise ships… pic.twitter.com/IgxW4YhyWZ
— anand mahindra (@anandmahindra) May 19, 2024