Jabardasth Ritu Choudhary Marriage: రహస్యంగా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి!

ఇటీవల రీతూ చౌదరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం పొందారు. తండ్రి మరణాన్ని రీతూ చౌదరి తట్టుకోలేకపోయారు. ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేశారు. అనంతరం ఒక షోలో తండ్రిని తలచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక సోషల్ మీడియాలో రీతూ చౌదరి తరచుగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంటారు.

Written By: Shiva, Updated On : June 13, 2023 2:49 pm
Follow us on

Jabardasth Ritu Choudhary Marriage: జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమె రహస్యంగా బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో ఒకరైన రీతూ చౌదరి అనేక స్కిట్స్ చేశారు. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. ఆమె తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తారు.

గతంలో ఆమె ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు విడుదల చేశారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి రీతూ చౌదరి బాయ్ ఫ్రెండ్ అని తెలిసింది. అలాగే ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అతడు ఓ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలు అనంతరం కొన్నాళ్ళు రీతూ పెళ్లి వ్యవహారం సద్దుమణిగింది. కారణం ఎలాంటి అప్డేట్ రాలేదు.

సడన్ గా సదరు వ్యక్తితో రీతూ చౌదరి పెళ్లి జరిగినట్లు ఫొటోలు బయటకు వచ్చాయి. నిరాడంబరంగా స్నేహితుల మధ్య రీతూ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఏడాది క్రితమే రీతూ చౌదరి పెళ్లి జరిగిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటి కూడా పూర్తి సమాచారం లేదు.

కాగా ఇటీవల రీతూ చౌదరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం పొందారు. తండ్రి మరణాన్ని రీతూ చౌదరి తట్టుకోలేకపోయారు. ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేశారు. అనంతరం ఒక షోలో తండ్రిని తలచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక సోషల్ మీడియాలో రీతూ చౌదరి తరచుగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంటారు. ఆ మధ్య విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి థాయిలాండ్ టూర్ కి వెళ్లారు. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.