‘రోజావనం’ ఛాలెంజ్ లో రోజా మొక్కలు మొక్కలునాటి హీరో అర్జున్, నటి ఖుష్బూ, యాంకర్ రష్మికి సవాల్ విసిరారు. రోజా విసిరిన చాలెంజ్‌ను హీరో అర్జున్, నటి ఖుస్బూలు స్పందించి ఇటీవల మొక్కలు నాటి మరో ముగ్గురి చొప్పున నామినేట్ చేశారు. తాజాగా ప్రముఖ యాంకర్ రష్మి కూడా రోజా విసిరిన చాలెంజ్‌కు స్పందించారు. నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో రష్మి మొక్కలు నాటి హీరో సత్యదేవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రముఖ యాంకర్ అనసూయకు సవాలు విసిరింది.
ఈ సందర్భంగా యాంకర్ రష్మి మాట్లాడుతూ ప్రతీఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా ఎండ తీవ్రతను, వాతావరణంలో మార్పును సమతుల్యత చేయడానికి అందరూ మొక్కలను పెంచాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.