సెల్ ఫోన్లకు పాకిన కరోనా!

ప్రపంచ దేశాలను వణికిస్తూ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలను చిన్నా భిన్నం చేస్తున్న కరోనా రక్కసి, ఇప్పుడు సెల్ ఫోన్‌ల వినియోగంపై పడింది. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫోన్ల కంపెనీ యజమానులు ఏమిచేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే వివిధ ఫోన్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. చైనాలోని ఫోన్ల విడిభాగాలను తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ వైరస్ దెబ్బతో ఫోన్ల విడిభాగాలు తయారు చేసే కంపెనీలు మూతపడుతుండటం కారణంగా ఫోన్ల ధరలు పెరగనున్నాయని మార్కెట్ […]

Written By: Neelambaram, Updated On : March 7, 2020 5:26 pm
Follow us on

ప్రపంచ దేశాలను వణికిస్తూ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలను చిన్నా భిన్నం చేస్తున్న కరోనా రక్కసి, ఇప్పుడు సెల్ ఫోన్‌ల వినియోగంపై పడింది. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫోన్ల కంపెనీ యజమానులు ఏమిచేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే వివిధ ఫోన్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. చైనాలోని ఫోన్ల విడిభాగాలను తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ వైరస్ దెబ్బతో ఫోన్ల విడిభాగాలు తయారు చేసే కంపెనీలు మూతపడుతుండటం కారణంగా ఫోన్ల ధరలు పెరగనున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శాంసంగ్ కంపెనీ దక్షణి కొరియాలోని ఒక తయారీ కేంద్రాన్ని మూసివేసింది. అంతేకాకుండా స్టార్ట్ ఫోన్ల ఉత్పత్తిని తాత్కాలికంగా వియత్నాంకు తరలిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది కూడా. తమ కంపెనీలో కూడా కరోనా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడం కారణంగా.. అతి పెద్ద శాంసంగ్ కంపెనీ.. కొన్ని రోజులు ఈ కంపెనీని మూసివేయనుంది. దీంతో.. రాబోయే రోజుల్లో.. ఫోన్ కొనాలనుకునే వారికి భారీగానే చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకూ కరోనా వైరస్‌.. 80కి పైగా దేశాలకు పాకింది. మన దేశంలో కూడా 31పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని నియంత్రించే మందు ఇప్పటి వరకు రాలేదు. కేవలం జాగ్రత్తలు పాటించడం తప్ప. ఈ మహమ్మారి భూతానికి ఇంకెన్ని అనర్ధాలు చూడాల్సిఉంటుందో అని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు.