పాతబస్తీపై కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

ట్విన్ సిటీస్ (హైదరాబాద్, సికింద్రాబాద్) లలో మెట్రో రైలు పరుగులు తీస్తున్నా..పాతబస్తీకి ఆ యోగం లేదని సీఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే ఎంఐఎం ఎమ్మెల్యేలు కృషి చేస్తే.. త్వరలోనే పాతబస్తీకి కూడా మెట్రోరైలు వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్బంగా కెసిఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో రైలు కోసం ఎంఐఎం సభ్యులు చేసిన విఙ్ఞప్తులపై స్పందించారు. ఎంజీబీఎస్ వరకు […]

Written By: Neelambaram, Updated On : March 7, 2020 4:23 pm
Follow us on

ట్విన్ సిటీస్ (హైదరాబాద్, సికింద్రాబాద్) లలో మెట్రో రైలు పరుగులు తీస్తున్నా..పాతబస్తీకి ఆ యోగం లేదని సీఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే ఎంఐఎం ఎమ్మెల్యేలు కృషి చేస్తే.. త్వరలోనే పాతబస్తీకి కూడా మెట్రోరైలు వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్బంగా కెసిఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో రైలు కోసం ఎంఐఎం సభ్యులు చేసిన విఙ్ఞప్తులపై స్పందించారు. ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు పూర్తి అయినా.. అక్కడ నుండి ఫలక్‌ నుమాకు మెట్రో మార్గం నిర్మాణం కాలేదని, అందుకు మార్గమధ్యంలో వున్న కట్టడాలే కారణమని కేసీఆర్ చెప్పారు. ఈ అడ్డంకులను తొలగించేందుకు స్థానిక నేతలు స్పందించినట్లైతే త్వరలోనే పాతబస్తీలో కూడా మెట్రోరైలు పరుగులు తీస్తుందన్నారు.

ఎంఐఎం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగితే టీఆర్ఎస్ మంత్రులు కూడా వారితో పాటు పాతబస్తీలో పర్యటించి.. వివాదాలను పరిష్కరిస్తారని.. ఆ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మెట్రో మార్గం నిర్మాణం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.